March 24, 202508:50:23 AM

Neha Shetty: నేహా శెట్టికి ఇది మంచి ఛాన్సే..!

Neha Shetty in Pawan Kalyan's OG Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు కీలక శాఖల్లో ఆయన పనిచేస్తున్నారు. వారంలో 4 రోజులు ఆయన జనాల్లోనే తిరుగుతున్నారు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం చాలా కష్టం. కానీ ఎలక్షన్స్ కి ముందే పవన్ కమిట్ అయిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని కచ్చితంగా పూర్తి చేయాల్సిందే. అవేంటో తెలుసు కదా. ‘ఓజీ’ (OG Movie)  ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)  .

Neha Shetty

ఈ సినిమాల కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఈ మధ్యనే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్లో జాయిన్ అయినట్టు మేకర్స్ ఓ ఫోటోని విడుదల చేశారు. మరోపక్క ‘ఓజీ’ ప్రాజెక్టుని పవన్ లేని సీన్లని చిత్రీకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు దర్శకుడు సుజీత్ (Sujeeth) . పవన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు మినహా మిగతా నటీనటులతో తీయాల్సిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది.

ఇక ఇప్పుడు థాయ్ ల్యాండ్లో ఓ సాంగ్ షూట్ జరుగుతుందని వినికిడి. ఇందులో ‘డిజె టిల్లు’ (DJ Tillu)  బ్యూటీ నేహా శెట్టి పాల్గొంటున్నట్టు సమాచారం. ఆమె తన సోషల్ మీడియాలో కూడా థాయ్ ల్యాండ్లో ఉన్నట్టు తెలిపింది. కానీ ఓజీ గురించి ప్రస్తావించలేదు. ‘ఓజీ’ లో నేహా శెట్టిని (Neha Shetty) ఓ స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారట. ప్రస్తుతం ఆ పాట షూటింగ్ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

ఇందులో పవన్ కళ్యాణ్ కనిపించడట. కానీ అతనికి సంబంధించిన కొన్ని విజువల్స్ ను తీసి తర్వాత మిక్స్ చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో సరైన ఆఫర్లు లేని టిల్లు బ్యూటీకి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.

లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.