March 23, 202507:01:39 AM

Radhika Apte: హీరోయిన్ రాధిక ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్!

Radhika Apte baby bump photoshoot goes viral

ఒకప్పుడు హీరోయిన్లు గ్లామర్ ఫోటో షూట్లు చేస్తున్నారు అంటేనే ఆడియన్స్ కి అదో వింతలా అనిపించేది. కానీ ఇప్పుడు దానిని మించిన వింతలు వారు చూడాల్సి వస్తుంది. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత హీరోయిన్లు విపరీతంగా గ్లామర్ ఫోటో షూట్లు చేసి.. వాటిని పబ్లిష్ చేస్తున్నారు.కొంత ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు కూడా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తున్నారు. అది కూడా సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్లతో..! వాళ్ళతోనే హీరోయిన్లు ఫోటో షూట్లు చేయడానికి గల కారణాలు లేకపోలేదు. సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్లు వీళ్ళ ఫొటోలతో బ్రాండింగ్ వంటివి చేస్తుంటారు.

Radhika Apte

ఫలితంగా వాళ్ళు లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు. పెద్ద సినిమా దర్శకనిర్మాతలతో కూడా వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంటుంది.., కాబట్టి వీళ్ళ ఫోటోగ్రఫి చూసి హీరోయిన్ల కి ఛాన్సులు ఇస్తూ ఉంటారు. ఈ మధ్య సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్లు హీరోయిన్ల బేబీ బంప్ ఫోటో షూట్లు కూడా చేస్తున్నారు. వాటిల్లో కూడా గ్లామర్ డోస్ ఉండటం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు బేబీ బంప్ తో ఉన్నప్పుడు బోల్డ్ ఫోటో షూట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇలాంటి ఫోటో షూట్లలో పాల్గొన్నారు.

తాజాగా ఆ లిస్టులోకి హీరోయిన్ రాధిక ఆప్టే (Radhika Apte) కూడా చేరింది. బాలయ్యతో (Nandamuri Balakrishna) ‘లెజెండ్’ (Legend) ‘లయన్’ (Lion) వంటి సినిమాల్లో నటించిన ఈమె.. 2012 లోనే బెనెడిక్ట్ టేలర్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. అయినా సినిమాలు కంటిన్యూ చేస్తుంది. అయితే ఈమె కొన్ని నెలల క్రితం ప్రెగ్నెంట్ అయ్యింది. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచింది. అయితే ఇటీవల తన బేబీ బంప్ తో చేసిన బోల్డ్ ఫోటో షూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది రాధికా ఆప్టే.

 

View this post on Instagram

 

A post shared by Ashish Shah (@ashishisshah)

నేహా శెట్టికి ఇది మంచి ఛాన్సే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.