March 31, 202510:35:09 AM

Prasanth Varma: ప్రశాంత్ వర్మ ఆశలన్నీ ప్రభాస్ పైనే…!

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ..నాని (Nani) నిర్మాణంలో రూపొందిన ‘అ!’ (Awe)తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర్ తో  (Rajasekhar) చేసిన ‘కల్కి’ నిరాశపరిచినా ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy)  తో హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన ‘హనుమాన్’ తో (Hanu Man) అయినా పాన్ ఇండియా దర్శకుల్లో ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమాని డైరెక్ట్ చేస్తూనే మరోపక్క పెద్ద పెద్ద ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు.

Prasanth Varma:

అలాగే పక్క సినిమాలకు కథలు కూడా అందిస్తున్నాడు. అలా అతను కథ అందించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)    సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. ఈ సినిమా ఫలితం ప్రశాంత్ వర్మ కథలపై అనుమానాలు కలిగేలా చేసింది. మోక్షజ్ఞతో (Nandamuri Mokshagnya) ప్రశాంత్ వర్మ తెరకెక్కించాల్సిన సినిమా కూడా క్యాన్సిల్ అయ్యింది. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ ప్రభాస్ పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.

ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ‘ది రాజాసాబ్’ (The Rajasaab) చిత్రం ఫైనల్ స్టేజిలో ఉంది. ఆ తర్వాత హను రాఘవపూడి (Hanu Raghavapudi)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ షూటింగ్లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా  (Sandeep Reddy Vanga)  దర్శకత్వంలో ‘స్పిరిట్’  (Spirit)  చేయాలి, అలాగే ‘సలార్ 2’ (Salaar) ‘కల్కి 2’ (Kalki 2898 AD) వంటివి కూడా ఫినిష్ చేయాలి.సో ప్రభాస్ డేట్స్ దొరకడం ఇప్పట్లో కష్టమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ వర్మకి ప్రభాస్ ఛాన్స్ ఇస్తాడా అంటే.. సందేహంగానే చెప్పాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.