సీనియర్ హీరోయిన్ తాప్సి (Taapsee Pannu) అందరికీ సుపరిచితమే. తెలుగులో మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి పలు హిట్ సినిమాల్లో నటించినా పెద్దగా బ్రేక్ రాలేదు. దీంతో బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ పింక్, బద్ లా వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసి అక్కడ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో అక్కడ ఈమె మార్కెట్, పారితోషికం వంటి విషయాల్లో కూడా పీక్స్ చూసింది. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఈమె వార్తల్లో నిలుస్తుంది అనే విషయం తెలిసిందే.
Taapsee Pannu
ఇక ఈమె ఈ ఏడాది బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోని ప్రేమ వివాహం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆమె పెళ్ళి గతేడాదే జరిగిపోయింది అంటూ షాక్ ఇచ్చింది.తాప్సి మాట్లాడుతూ.. “అవును మా వివాహం గతేడాది చివర్లో అంటే డిసెంబర్‌లోనే జరిగింది. రిజిస్టర్ ఆఫీసులో లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నాం. కుటుంబ సభ్యుల సమక్షంలోనే మేము రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. త్వరలోనే మా మ్యారేజ్ యానివర్సరి జరగనుంది.
చాలా మంది మా పెళ్ళి ఈ ఏడాది జరిగిందనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఓపెన్ అవ్వకపోతే అందరికీ ఇది మిస్టరీగానే ఉండేది అనడంలో అతిసయోక్తి లేదు. పర్సనల్ లైఫ్ కి, ప్రొఫెషనల్ లైఫ్ కి బ్యాలెన్స్ చేయడం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మా పెళ్ళి వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచాం. మా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వివరాలు బయట పెట్టుకోవడానికి మేము అంతగా ఇష్టపడం. అలా అని బయటపెట్టాల్సి వస్తే.. భయపడం” అంటూ చెప్పుకొచ్చింది.