కన్నడ స్టార్ ‘ఉపేంద్ర’ (Upendra Rao) సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో… వాటిని ఆయన ప్రమోట్ చేసే తీరు కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది అని చెప్పాలి. ‘A’ ‘ఉపేంద్ర’ ‘రా’ వంటి సినిమాలతో ఓ ట్రెండ్ సెట్ చేశాడు ఉపేంద్ర. ఇటీవల ‘UI ది మూవీ’ ( UI The Movie) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘2040 లో ప్రపంచం ఎలా ఉంటుంది’ అనే థీమ్ తో ఉపేంద్ర స్టైల్లో తీసిన సినిమా ఇది. దీనికి ఉపేంద్రనే దర్శకుడు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ (Manoharan) & వీనస్ ఎంటర్టైనర్స్ కెపి శ్రీకాంత్ (Sreekanth K.P.) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు.
UI Movie Collections:
నవీన్ మనోహరన్ సహా నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. దీంతో టార్గెటెడ్ ఆడియన్స్ బాగానే చూస్తున్నారు. వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 0.45 cr |
సీడెడ్ | 0.14 cr |
ఆంధ్ర(టోటల్) | 0.46 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.05 cr |
‘UI’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాలి. 5 రోజుల్లో ఈ సినిమా రూ.1.05 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించింది. అయితే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. క్రిస్మస్ హాలిడే ని కూడా ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.