March 23, 202509:12:48 AM

Vijay Devarakonda: VD14 కోసం హాలీవుడ్ నుండి టెక్నీషియన్ ను తీసుకొచ్చిన రాహుల్!

కెరీర్ తొలినాళ్లలోనే హయ్యస్ట్ పీక్ చూసేసి, ప్రస్తుతం హీరోగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) . 2018లో వచ్చిన “ట్యాక్సీవాలా” ( Taxiwaala) తర్వాత విజయ్ కి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. అంటే ఆరేళ్లుగా సరైన హిట్ లేకుండా కేవలం క్రేజ్ తో కెరీర్ నెట్టుకొస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే.. 2025 నుండి విజయ్ కెరీర్ మళ్లీ పీక్ వెళ్లనుంది అంటున్నాయి ఇండస్ట్రే వర్గాలు. ఎందుకంటే..

Vijay Devarakonda

గౌతమ్ (Gowtam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంకా పేరు పెట్టని చిత్రం చాలా బాగా వచ్చిందని, ఆ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయాలని సితార వంశీ ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడట. అదే విధంగా.. 13వ సినిమా దర్శకుడు రవికుమార్ కోలా కూడా మంచి సబ్జెక్ట్ సిద్ధం చేసాడని వినికిడి. ఇక ఇప్పుడు 14వ సినిమా దర్శకుడు రాహుల్ ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాడు. ఆల్రెడీ విజయ్ కెరీర్ లోన్ హయ్యస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా..

ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ కెమెరామెన్ ను తీసుకొచ్చాడు రాహుల్. హాలీవుడ్ ప్రఖ్యాత చిత్రాలైన “మోటార్ సైకిల్ డైరీస్, ఇన్ టూ ది వైల్డ్” వంటి ప్రఖ్యాత చిత్రాల సినిమాటోగ్రాఫర్ ఎరిక్ గౌటీర్ VD14కి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ సినిమాలో ఆల్రెడీ హాలీవుడ్ నటుడు “ది మమ్మీ” ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లో ఓ కీలకపాత్ర పోషించనున్న విషయం తెలిసిందే.

సో, ఈ మూడు సినిమాలతో విజయ్ దేవరకొండ తన పూర్వవైభవాన్ని తిరిగిపొందడం ఖాయం అంటున్నారు ఇన్సైడ్ సోర్స్. విజయ్ ప్రస్తుతం VD12 షూట్లో బిజీగా ఉన్నాడు, ఆ తర్వాత రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) సినిమా పూర్తి చేసుకొని VD14 కోసం ఏకంగా ఏడాది సమయం కేటాయించనున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చత్రం 2025 చివర్లో షూటింగ్ మొదలుకానుంది.

పుష్ప 2: డిసెంబర్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.