March 19, 202501:12:41 PM

Allu Arjun: అలా అయితే దీనికి కూడా వెయ్యి కోట్ల బడ్జెట్ అయిపోతుందిగా?

1000 Cr Budget for Allu Arjun Next Movie

అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ తో (Pushpa 2: The Rule) ఓ భారీ హిట్టు కొట్టారు. హిందీలో కూడా పెద్ద స్టార్ అయ్యి కూర్చున్నాడు. దీంతో అతని నెక్స్ట్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా హిందీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంది. దీనికి పెద్దగా సస్పెన్స్ లేకుండానే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలోనే అని అల్లు అర్జున్ అండ్ టీం చెప్పేసింది. అయితే త్రివిక్రమ్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తో పాన్ ఇండియా సినిమా చేయాలి.

Allu Arjun

Allu Arjun to attend Game Changer Pre Release event ! (1)

అంతేకాకుండా త్రివిక్రమ్ ఇప్పటివరకు చేసింది ‘ఒక ఇంట్లో సమస్య,దాని వల్ల విడిపోయిన కుటుంబం, తర్వాత హీరో వల్ల ఆ సమస్య తీరిపోయి తిరిగి కలవడం’ వంటి కాన్సెప్ట్ సినిమాలే. కాకపోతే తన మార్క్ డైలాగ్స్, స్టార్ ఇమేజ్ వల్ల.. ఆ సినిమాలు గట్టెక్కేస్తూ వచ్చాయి. కానీ పాన్ ఇండియా అంటే.. ఈ ‘హోమ్ టూర్’ లాంటి సినిమాలు సరిపోవు.

what is Allu Arjun doing now has he resumed work

త్రివిక్రమ్ కి పురాణాలపై మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఫాంటసీ సినిమాలకి మంచి డిమాండ్ కూడా ఉంది. అందుకే అల్లు అర్జున్ తో అలాంటి సినిమా చేయబోతున్నాడు అని టాక్ గట్టిగానే వినిపించింది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. ‘లార్డ్ కార్తికేయ’ కథని త్రివిక్రమ్ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. కార్తికేయుని పుట్టుక.. ఆరు జీవాల కలయిక వంటి సంగతులు ఈ జనరేషన్ కి పెద్దగా తెలీదు.

అందుకే స్కంధ పురాణాన్ని ఆధారం చేసుకుని ఈ కథ డిజైన్ చేశాడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని అంటున్నారు. అదే కనుక నిజమైతే.. ఈ సినిమా బడ్జెట్ కూడా వెయ్యి కోట్లు అయిపోతుంది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.