March 27, 202510:32:27 PM

Venkatesh: అనిల్ రావిపూడికి కాదు క్రెడిట్ అంతా వెంకీకే ఇవ్వాలట.. ఎలా అంటే?

That Credit Goes to Only Venkatesh (2)

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) కొన్నాళ్లుగా హిట్లు లేవు. దీంతో 2025 సంక్రాంతిపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్లో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer)   ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ‘గేమ్ ఛేంజర్’ అనేది పెద్ద బడ్జెట్ సినిమా. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు దిల్ రాజు. అందువల్ల ఈ సినిమాకి పోటీ లేకుండా మంచి టైంలో రిలీజ్ చేయాలి అనుకున్నారు.

Venkatesh

Hero Venkatesh Reacts On IT Raids

కానీ అది వర్కౌట్ కాలేదు. అందుకే డిసెంబర్లో రిలీజ్ చేయాల్సిన ‘గేమ్ ఛేంజర్’ ని సంక్రాంతికి తెచ్చారు. దీని కోసం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని పోస్ట్ పోన్ చేద్దామని దిల్ రాజు అనుకున్నారు. ఎందుకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది ఎప్పుడు వచ్చినా ఆడుతుంది అనేది దిల్ రాజు నమ్మకం. పైగా ‘గేమ్ ఛేంజర్’ పక్కన వస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ని జనాలు పట్టించుకోరేమో అనే భయం కూడా ఆయనకు కలిగింది.

Boyapati Srinu for Balakrishna and Anil Ravipudi for Venkatesh

దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కూడా ఒప్పుకున్నారు. కానీ వెంకటేష్ (Venkatesh Daggubati)మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కచ్చితంగా సంక్రాంతికి వస్తే మంచి హిట్ అవుతుంది అని వెంకటేష్ చెప్పారట. కావాలంటే తాను కూడా పూర్తిస్థాయిలో సినిమాను ప్రమోట్ చేస్తానని దిల్ రాజుకి మాట ఇచ్చారట. అంత పెద్ద స్టార్ హీరో చెప్పాక..

Sirish opens up about Dil Raju

కొంచెం డౌట్ తోనే దిల్ రాజు ఒప్పుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ కి ఇబ్బంది లేకుండా 4 రోజులు గ్యాప్ ఇచ్చి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ని విడుదల చేశారు. అది దిల్ రాజుకి మంచే అయ్యింది. ‘గేమ్ ఛేంజర్’ తో వచ్చిన నష్టాలను ‘సంక్రాంతికి వస్తున్నాం’ చాలా వరకు తీర్చేసింది. దీంతో వెంకటేష్ పంతం వల్ల దిల్ రాజు బయట పడినట్టు అయ్యింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.