March 20, 202511:36:47 AM

Anjali: ‘గేమ్ ఛేంజర్’ మంచి సినిమా.. కానీ : అంజలి

Anjali Reaction About Game Changer Movie Result

అంజలి (Anjali)  తెలుగమ్మాయి. కానీ బ్రేక్ వచ్చింది తమిళ సినిమాలతో. తెలుగులో కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. హీరోయిన్ గా బిజీగా లేకపోయినా.. మంచి మంచి పాత్రలతో మెప్పిస్తూనే ఉంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది. అప్పన్నకి(రాంచరణ్) (Ram Charan) భార్య పాత్రలో కావచ్చు, రామ్ నందన్ కి(రాంచరణ్) కి తల్లి పాత్ర కావచ్చు.. చాలా బాగా చేసింది.అయితే సినిమా ఆడలేదు.

Anjali

Anjali Reaction About Game Changer Movie Result

దాని వల్ల ఆమె పాత్రకి అనుకున్నంత రెస్పాన్స్ వినిపించలేదు. ఈ విషయాలపై తాజాగా అంజలి స్పందించింది. అంజలి మాట్లాడుతూ.. “ఒక యాక్టర్ గా నా రెస్పాన్సిబిలిటీ మాత్రం నేను నిర్వర్తించాను. నాకు ఒక రోల్ ఇచ్చారు. దాన్ని బాగా చేయాలి. అక్కడితో నా పని అయిపోతుంది. అయినప్పటికీ సినిమాని ఆడించాలి అనేది మా తపన. అందుకోసం ప్రమోషన్స్ కి వెళ్లడం, ఆడియన్స్ కి సినిమా గురించి మా పాత్ర గురించి చెప్పడం, మూవీ రిలీజ్ టైంని గుర్తు చేయడం..

Game Changer Movie 5 Days Total Worldwide Collections

వంటివి మా బాధ్యత. తర్వాత మా చేతుల్లో ఉండదు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ గురించి మాట్లాడాలి అంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి. నేను ‘గేమ్ ఛేంజర్’ కి 200 శాతం ఎఫర్ట్ పెట్టాను. నా వరకు నేను హ్యాపీ. ఎందుకంటే ‘గేమ్ ఛేంజర్’ చూసి నాకు చాలా మంది మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

Star Actress Anjali is Also a Special in Game Changer (1)

సినిమా బాలేదు అని ఎవ్వరూ చెప్పలేదు. ఇది మంచి సినిమా అని చెప్పారు. సినిమా బాగుండటం వేరు. మంచి సినిమా వేరు. నేను బాగా యాక్ట్ చేశాను అని చెప్పారు. నాకు అది సరిపోతుంది. ఇక మిగిలిన దాని గురించి మాట్లాడాలి అంటే దానికి ఒక అరగంట సెపరేట్ టైం కావాలి” అంటూ చెప్పుకొచ్చింది.

 

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.