March 21, 202501:01:41 AM

Srikanth Iyengar: పాపం శ్రీకాంత్ అయ్యంగార్.. అందుకే చిన్న సినిమాల ఈవెంట్లలో రెచ్చిపోతున్నాడా?

Producers to Stay Away From Actor Srikanth Iyengar

సినిమా వేడుకల్లో నటీనటులు మామూలుగా మాట్లాడితే జనం కానీ, మీడియా కానీ పట్టించుకోరు అని నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) అనుకుంటున్నట్టు ఉన్నారు. ఈ మధ్య అనవసరంగా ఆయన నోరు పారేసుకుంటున్నారు. మొన్నామధ్య ‘పొట్టేల్’ (Pottel) అనే సినిమా వచ్చింది. అది బాగానే ఉంటుంది. దానికి మంచి రివ్యూస్ వచ్చాయి. ఆ ఉద్దేశంతోనే ‘పొట్టేల్’ టీం సినిమాని పుష్ చేయడానికి సక్సెస్ మీట్ పెట్టుకున్నారు. రివ్యూయర్స్ అందరికీ థాంక్స్ చెప్పారు. కానీ శ్రీకాంత్ అయ్యంగార్ వచ్చి ‘రివ్యూయర్స్ ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు..

Srikanth Iyengar

ప్రజలు చూసుకుంటారు’ అంటూ దారుణమైన పదజాలంతో హేయమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో శ్రీకాంత్ అయ్యంగార్ ‘తన మాటలు వెనక్కి తీసుకుని.. మీడియాకి క్షమాపణలు చెప్పాలని’ కోరారు. అతని కామెంట్స్ వల్ల ‘పొట్టేల్’ సినిమాని మీడియా బ్యాన్ చేసింది. జనాలు కూడా ఆ సినిమా ఉంది అనే విషయాన్ని మర్చిపోయారు. అందువల్ల ఆ సినిమా చచ్చిపోయింది. ఇప్పుడు ‘రాచరికం’ (Racharikam) అనే సినిమా ఈవెంట్లో కూడా శ్రీకాంత్ అయ్యంగార్ మైక్ తీసుకుని రివ్యూ రైటర్ల పై మళ్ళీ విరుచుకుపడ్డారు.

‘కేవలం డబ్బుల కోసమే రివ్యూలు రాస్తారు, మీ బుద్ధి అది. నేను 2.25 రేటింగ్ ఇస్తా. అనే బ్యాచ్ నా ఇనస్టాగ్రామ్ లో మీ నంబర్లు పెట్టండి. డబ్బులు పంపుతా? ‘ అంటూ ఘోరమైన వ్యాఖ్యలు చేశాడు శ్రీకాంత్ అయ్యంగార్. అయినప్పటి శ్రీకాంత్ ని మీడియా పెద్దగా కేర్ చేయలేదు. యూట్యూబ్, సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రమే అతని వీడియోలు పోస్ట్ అయ్యాయి. కానీ అవి అంతగా ఇంపాక్ట్ చూపలేదు. దీంతో మీడియా అతన్ని పూర్తిగా బ్యాన్ చేసింది అని అర్థం చేసుకోవచ్చు.

పెద్ద సినిమాల ఈవెంట్లకి ఇతన్ని పెద్ద నిర్మాతలు పిలవడం లేదట. పిలిచినా స్టేజిపైకి పిలిచి మైక్ ఇవ్వడం లేదు అని అంటున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాలో స్టేజి సీన్ టైపులో అనమాట. చిన్న సినిమా ఈవెంట్లకి అతను అందుకే వెళ్లి తన ‘నీచమైన బుద్దిని’ బయటపెడుతున్నాడు అని ఇన్సైడ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

‘గేమ్ ఛేంజర్’ మంచి సినిమా.. కానీ : అంజలి

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.