March 22, 202505:34:31 AM

Pragya Jaiswal: బాలయ్యతో వరుస సినిమాలు.. కారణమేంటో చెప్పిన ప్రగ్యా జైస్వాల్‌!

Pragya Jaiswal Shares her Work Experience with Balakrishna

కొంతమందేమో బాలకృష్ణతో (Nandamuri Balakrishna)  సినిమానా అంటే ‘వామ్మో’ అని భయపడతారు. దానికి కారణం ఆయనంటే ఓ భయం. ఆన్‌సెట్స్‌ లీక్స్ అంటూ కొన్ని, ఆయన బయట చేసే కొన్ని కోపంతో కూడిన చేష్టలే దానికి కారణం అవ్వొచ్చు. అయితే మరికొంతమంది మాత్రం ఆయనతో వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. ఇలాంటివారిలో ప్రగ్యా జైస్వాల్‌ (Pragya Jaiswal) ఒకరు. బాలకృష్ణతో ఆమె వరుస సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరో సినిమా ఓకే చేశారు. మొన్న సంక్రాంతికి ‘డాకు మహారాజ్‌’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు బాలకృష్ణ – ప్రగ్యా జైస్వాల్‌.

Pragya Jaiswal

గతంలో బాలకృష్ణతో ఆమె నటించిన ‘అఖండ’ (Akhanda)  సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాలో కూడా ఆమెను ఎంపిక చేశారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా జైస్వాల్‌ మాట్లాడుతూ.. బాలకృష్ణతోఎ వరుస సినిమాల గురించి స్పందించింది. అలాగే నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి కూడా మాట్లాడింది. ‘డాకు మహారాజ్‌’ సినిమాలో కావేరి పాత్ర చేసిన తర్వాత అందరూ నన్ను ‘డాకు మహారాణి’ అని పిలుస్తున్నారు.

అంతలా కావేరి పాత్ర ప్రజలను ప్రభావితం చేసింది. బాలకృష్ణతో రెండు సినిమాలకు వర్క్‌ చేయడం గురించి అడిగితే ఆయనో లెజెండ్‌. బాలకృష్ణ పేరు చెప్పగానే ‘పాజిటివిటి’ అనే పదం గుర్తొస్తుంది. ఆయన నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బాలకృష్ణ తన మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పేస్తారు. అందరినీ ఒకేలా గౌరవిస్తారు అని బాలయ్యను ఆకాశానికెత్తేసింది.

ఇక సినిమాల్లో పాత్ర ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారని, అంతేగానీ వారి వయసు ఆధారంగా అవకాశాలు ఇవ్వరని అంటోంది ప్రగ్యా. ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేశానా, లేదా అనేదే తాను ఆలోచిస్తానని, నా దృష్టిలో వయసు ఒక సమస్య కాదని చెప్పింది. అయితే ‘అఖండ 2’ నుండి ప్రగ్యా జైస్వాల్‌ తప్పుకుంది అని వార్తలొస్తున్నాయి. ఆమె ప్లేస్‌లోనే సంయుక్తను తీసుకున్నారు అని కూడా అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

ఐశ్వర్య రాజేష్ మళ్ళీ బిజీ అవుతుందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.