March 23, 202508:33:13 AM

Vijay Deverakonda: విజయ్‌ కోసం అమితాబ్‌? రాహుల్‌ సాంకృత్యాన్‌ ప్లానేంటి? సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌!

Amitabh Bachchan in Vijay Deverakonda movie (1)

‘గీత గోవిందం’ (Geetha Govindam) లాంటి ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన తర్వాత ‘నోటా’ (NOTA) లాంటి డిజాస్టర్‌ అందుకున్న విజయ్‌ దేవరకొండను (Vijay Devarakonda) తిరిగి హిట్‌ ట్రాక్‌ ఎక్కంచిన చిత్రం ‘టాక్సీవాలా’ (Taxiwaala). తొలి రోజుల్లో ఫలితం విషయంలో కాస్త అటు ఇటు మాటలు వినిపించినా సినిమాలోని ఎమోషన్స్‌కు జనాలు బాగా కనెక్ట్‌ అయిపోయారు. ఇప్పుడు మరోసారి విజయ్‌కి ఆ సినిమా కాంబినేషన్‌ కుదిరింది. రాహుల్‌ సాంకృత్యాన్‌తో (Rahul Sankrityan) విజయ్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన రూమర్స్‌ బయటకు వచ్చాయి.

Vijay Deverakonda

Vijay Deverakonda Fans Eagerly Await Updates on His Upcoming film (3)

రాయలసీమ నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్‌ కథతో ఈ సినిమా రూపొందనుందని ఇప్పటికే వార్తు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభించనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా సెట్‌ రూపొందించే పనుల్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని రాహుల్‌ సాంకృత్యాన్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. రిపబ్లిక్‌ డేనే ఎందుకు అనే ప్రశ్నకు సినిమా నేపథ్యానికి లింక్‌ ఉంది అని చెబుతోంది సినిమా సన్నిహిత బృందం.

Amitabh Bachchan comments on Allu Arjun

బ్రిటిష్‌ పాలన కాలం నేపథ్యంలో, ఇప్పటివరకూ ఎవరూ టచ్‌ చేయని కథతో ఈ సినిమా తెరకెక్కి్తారట. ఈ మేరకు బ్రిటిష్‌ పాలన కాలంలో జరిగిన యథార్థ సంఘటనలతో రాహుల్‌ కథ, స్క్రీన్‌ ప్లే సిద్ధం చేశారు అని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా నటిస్తున్నారని ఓ టాక్‌ నడుస్తోంది. అయితే అమితాబ్‌ ఏ పాత్రలో నటిస్తున్నారు అనేది తెలియల్సి ఉంది.

ఇలాంటి కథల్లో ఆయన హీరోకు తాతగా ఎక్కువగా కనిపిస్తుంటారు. లేదంటే గురువుగా కనిపిస్తారు. కాబట్టి ఈ రెండు పాత్రల్లో ఒకటి అవ్వొచ్చు. త్వరలో ప్రారంభం కాబోయే తొలి షెడ్యూల్‌లో అమితాబ్‌ ఉండరని, రెండో షెడ్యూల్‌ నుండి వస్తారని సమాచారం. మొదటి షెడ్యూల్‌లో విజయ్‌ ఇంట్రడక్షన్‌ సీన్స్ తెరకెక్కిస్తారట. చిత్రీకరణ మొదలయ్యేలోపు హీరోయిన్‌ సహా మిగిలిన నటీనటుల ఎంపిక పూర్తి చేస్తారట.

ఈ రెండు క్లిక్కయితే చాలు చైతూ!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.