![Allu Aravind comments on Chirutha movie](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Allu-Aravind-comments-on-Chirutha-movie.jpg)
అల్లు అరవింద్ (Allu Aravind) ఇటీవల ‘తండేల్’ (Thandel) ఈవెంట్లో దిల్ రాజు (Dil Raju) గురించి చెబుతూ.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్లాప్ అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులకు కోపం వచ్చింది. అందువల్ల సోషల్ మీడియాలో అల్లు అరవింద్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. దీనివల్ల మెగా వర్సెస్ అల్లు అనే గొడవలు మళ్ళీ రేపినట్టు అయ్యింది. సరే ‘గేమ్ ఛేంజర్’ ఆడలేదు. అల్లు అరవింద్ అలా మాట్లాడినా, మాట్లాడుండకపోయినా.. అందులో వాస్తవం ఉంది.
Allu Aravind
కాబట్టి జనాలు ఎప్పటికైనా దాన్ని మర్చిపోతారు. కానీ ఇప్పుడు అంతకు మించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అల్లు అరవింద్. ‘తండేల్’ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో … ” ‘చిరుత’ (Chirutha) బిలో యావరేజ్ సినిమా. ఆ టైంలో నా మేనల్లుడు రాంచరణ్ తో (Ram Charan) ‘మగధీర’ (Magadheera) తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చాను, అది తనపై నాకున్న ప్రేమ” అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ‘మగధీర’ క్రెడిట్ తనకి కూడా ఉంటుంది అనడంలో తప్పులేదు.
కానీ ‘చిరుత’ బిలో యావరేజ్ సినిమా అనడం కరెక్ట్ కాదు. 2007 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా రూ.25 కోట్లు షేర్ ను రాబట్టింది. డెబ్యూ హీరోల్లో ఇది ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బయ్యర్స్ అంతా మంచి లాభాలు ఆర్జించారు.
అలాంటి సినిమాని అల్లు అరవింద్ ప్లాప్ అనడం ఎంతవరకు కరెక్ట్? కమర్షియల్ సక్సెస్..లు అంటే ఏంటో ఆయనకు తెలియనివి కావు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. అదే ఏడాది రిలీజ్ అయిన అల్లు అర్జున్ (Allu Arjun) ‘దేశముదురు’ (Desamuduru) కంటే కూడా ‘చిరుత’ ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇవన్నీ అల్లు అరవింద్ ఆలోచించకుండా అలా ఎలా అనేశారో మరి..!
Chirutha is average film says Allu Aravind#Chiurutha collected RS.25 crores share(Ram Charan Debut hero)
Where #Desamudhuru collected RS.21 crores share#RamCharan #AlluArjun #AlluAravind pic.twitter.com/gyjCD0skIn
— Phani Kumar (@phanikumar2809) February 7, 2025