అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.2024 ఎన్నికల టైంలో అల్లు అర్జున్.. నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి తరఫున ప్రచారం చేసి వచ్చినప్పటి నుండి పలు ఈవెంట్లలో అతను దీనిపై వేసిన సెటైర్లు వంటి వాటిపై మెగా అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. అందుకే ‘పుష్ప 2’ ని (Pushpa 2) ఆంధ్రాలో మెగా అభిమానులు దూరం పెట్టారు. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్ వంటి ఏరియాల్లో చాలా మంది మెగా అభిమానులు ‘పుష్ప 2’ పై నెగిటివ్ పోస్టులు వేయడం..జరిగింది.
Thandel
వీటి వల్ల ఈస్ట్, వెస్ట్ వంటి ఏరియాల్లో ‘పుష్ప 2’ బుకింగ్స్ పై ప్రభావం చూపినట్టు అయ్యింది. చూస్తుంటే ఇప్పుడు ‘తండేల్’ (Thandel) కూడా అలాంటి పరిస్థితే వచ్చినట్లు కనిపిస్తుంది. ‘తండేల్’ నాగ చైతన్య (Naga Chaitanya) సినిమా కదా? అనే డౌట్ అందరికీ రావచ్చు. కానీ ఇది అల్లు కాంపౌండ్లో రూపొందిన సినిమా. అలా అని మెగా అభిమానులు దీన్ని మొదటి నుండి టార్గెట్ చేసింది లేదు.
కానీ ఇటీవల ‘తండేల్’ ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు అరవింద్ (Allu Aravind).. ‘రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ ను (Game Changer) ఉద్దేశించి నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో ‘ ‘రాంచరణ్’ డెబ్యూ మూవీ చిరుత బిలో యావరేజ్ సినిమా..! అలాంటి టైంలో అతనితో ‘మగధీర’ (Magadheera) తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చాను’ అన్నారు కామెంట్స్ చేశారు. వీటిపై మెగా అభిమానులు బాగా అప్సెట్ అయ్యి .. గతాన్ని తవ్వుతున్నారు. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ రోజున అల్లు అరవింద్ బర్త్ డేని ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నారు.
అయితే కేక్ పై పుష్ప బ్రాండ్ సింబల్ పెట్టి ఉంది. దీంతో ‘గేమ్ ఛేంజర్’ ప్లాప్ అవ్వడంతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉందని మెగా అభిమానులు భావిస్తున్నారు. ‘ఆవు చేనులో మేస్తుంటే.. దూడ గట్టుమీద మేస్తుందా?’ అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇదే క్రమంలో ‘తండేల్’ సినిమాని కూడా వాళ్ళు దూరం పెడుతున్నట్టు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే స్పష్టమవుతుంది. అందుకే ‘తండేల్’ కి ఈస్ట్, వెస్ట్ వంటి ఏరియాల్లో బుకింగ్స్ మరింత డల్ గా ఉన్నాయి.