March 18, 202502:38:52 PM

‘మిసెస్‌’ సినిమాపై పురుష హక్కుల సంస్థ ఆగ్రహం.. ఏమైందంటే?

Netizens fires on men rights association

మహిళల అభ్యున్నతికి, సాధికారత కోసం పని చేసే సంస్థలు చాలానే ఉన్నాయి. ఈ సమాజంలో మహిళలు వెనుకబడిపో కూడదు అంటూ వాళ్లు గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కొంతమందికి మంచి స్పందన వస్తోంది. అలాగే పురుషుల కోసం కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి. అయితే వీటికి అంతగా వాయిస్‌ ఉండదు. ఒకవేళ మాట్లాడినా నెటిజన్లు (Netizens ) ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ‘మిసెస్‌’ సినిమా విషయంలో ఇదే జరిగింది.

Netizens

Netizens fires on men rights association

సన్యా మల్హోత్ర (Sanya Malhotra) ప్రధాన పాత్రలో ‘మిసెస్‌’ అనే ఓ సినిమా తెరకెక్కించి. ఈ హిందీ సినిమా జీ5లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చింది. తాజాగా ఈ చిత్రంపై సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌ అనే ఒక పురుష హక్కుల సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమాను విమర్శిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. మితిమీరిన స్త్రీ వాదాన్ని ఈ సినిమా ప్రోత్సహిస్తోందని ఆ పోస్టులో పేర్కొంది. మహిళ తన ఇంట్లో పనులు చక్కబెట్టి, కుటుంబసభ్యుల అవసరాలు తీరిస్తే.. అదెలా అణచివేత అవుతుంది అని ప్రశ్నించింది.

అక్కడితో ఆగకుండా ఇంట్లో వంట చేయడంలో ఒత్తిడి ఏం ఉంటుందని. అదొక రకమైన ప్రశాంతతను అందిస్తుందని కమెంట్‌ చేసింది. కుటుంబం కోసం పురుషులు ఎంతో శ్రమిస్తుంటారని, పని ప్రదేశాల్లో ఒత్తిడికి లోనవుతారని మగాళ్ల పరిస్థితిని కూడా వివరించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు Netizens ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ ఇలాం పోస్టు పెట్టడం సరికాదు అంటూ క్లాసు తీసుకుంటున్నారు.

Netizens fires on men rights association

ఇంటి పనులు చేస్తూనే మహిళలు ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారని, బయట ఎన్ని పనులు చేసినా ఇంటికి వచ్చాక కుటుంబసభ్యుల అవసరాలు తీరుస్తున్నారు అని నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో ఈ విషయంలో ఇప్పుడో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. 2021లో మలయాళంలో వచ్చిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’కు రీమేక్‌. పెళ్లి తర్వాత కొంతమంది యువతులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి సినిమాలో ప్రస్తావించారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.