
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ ( Soggade Chinni Nayana) ఫేమ్ కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో ఒక సినిమా రావాల్సి ఉంది. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) అందించిన కథతో ఈ సినిమా రావాలి. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), చిరంజీవి కలిసి చేస్తారు అంటూ ప్రచారం జరిగింది. అయితే సిద్ధు బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత తేజ సజ్జని (Teja Sajja) టీం అప్రోచ్ అయ్యింది. చిరంజీవి అడిగితే.. తేజ కూడా చేయకుండా ఉంటాడా? కానీ ఎక్కడో ఏదో జరిగింది.
Mazaka
దీంతో ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు చిరు. అలాగే చిరు అనుమతితో ప్రసన్న ఈ కథని త్రినాధ్ రావ్ నక్కినకి (Trinadha Rao) ఇచ్చేశారు. వెంటనే దాన్ని సందీప్ కిషన్ తో (Sundeep Kishan) ఓకే చేయించుకోవడం జరిగిపోయింది. అయితే ‘మజాకా’ (Mazaka) ట్రైలర్ చూశాక ఇది చిరు రిజెక్ట్ చేయడమే మంచిదైంది అని కొందరు అంటున్నారు. ఎందుకంటే ట్రైలర్లో ఎక్కువగా రావు రమేష్ (Rao Ramesh) పాత్ర ఏజ్ గురించి ప్రస్తావన, పంచ్..లు ఎక్కువగా ఉన్నాయి. ‘ ‘మన్మధుడు’ లా ఉండాలి కానీ మనవడిని ఎత్తుకునేలా’ కాదు వంటి డైలాగులు రావు రమేష్ కి ఓకే..!
చిరంజీవి ఏజ్ కి కూడా ఓకే. కానీ ఆయన ఇమేజ్ కి సెట్ అవ్వవు. కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు.. మజాకా (Mazaka) హీరో సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు నక్కిన కూడా ఇదే చెప్పారు. ‘కథ బాగుండొచ్చు కానీ.. ఇది చిరు స్థాయికి తగ్గ కథ కాదు. రావు రమేష్ వంటి వారు చేస్తే కామెడీ బాగా పండుతుంది. ఆడియన్స్ కి ఇబ్బంది ఉండదు హ్యాపీగా నవ్వుకుంటారు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.