March 25, 202510:33:07 AM

ఇలా చేసేవేంటి హీరోయినూ.. ఫేమ్‌ ఇందుకు వాడుకుంటావా?

Actress Ranya Rao Arrested for Allegedly Smuggling Gold (1)

బంగారాన్ని అక్రమంగా మన దేశానికి తీసుకొచ్చింది అనే అభియోగాలతో ప్రముఖ కన్నడ నటి రాణ్యా రావ్‌ను (Ranya Rao) ఎయిర్‌పోర్టు అధికారులు అరెస్టు అయ్యారు. ఈ క్రమంలో దుబాయి నుండి ఆమె తీసుకొచ్చిన 15 కిలోల బంగారాన్ని బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో శాండిల్‌వుడ్‌లో ఇప్పుడు ఈ వ్యవహారంలో సంచలనంగా మారింది. ఇటీవల తరచుగా దుబాయి వెళ్లి వస్తుండడంతో రాణ్యాపై డీఆర్‌ఐ అధికారులు నిఘా పెట్టారు.

Ranya Rao

Actress Ranya Rao Arrested for Allegedly Smuggling Gold (1)

గత 15 రోజుల్లో 4 సార్లు ఆమె దుబాయి వెళ్లొచ్చింది. గోల్డ్‌ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొస్తున్నారని అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ప్లాన్‌ చేసి ఆమె అక్రమ బంగారం రవాణా గుట్టు రట్టు చేశారు. అయితే ఆమె వెనుక మరికొంతమంది ఉన్నారని, కొంతమంది అధికారులు కూడా ఉన్నారు అని శాండిల్‌ వుడ్‌ వర్గాల సమాచారం. కర్ణాటకకు చెందిన ఓ పోలీసు అధికారికి రాణ్యా (Ranya Rao) బంధువు అని సమాచారం. అయితే ఆమె బంధువు కాదని కేవలం పరిచయస్థురాలే అని చెబుతున్నారు.

దీంతో స్మగ్లింగ్‌లో వారి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలోనూ డీఆర్‌ఐ అధికారులు విచారణ చేస్తున్నారట. సుదీప్‌ హీరోగా నటించిన ‘మాణిక్య’ సినిమాతో రాణ్యా రావ్‌ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత ‘వాఘా’, ‘పటాకీ’ తదితర సినిమాల్లో నటించింది. అయితే ఇన్నాళ్లూ ఆమె ఎలా తప్పించుకుంది అనే డౌట్‌ చాలామందికి రావొచ్చు. దీని సెలబ్రిటీ ప్లాన్‌ వేసింది అని సమాచారం. ఆమె విమానం దిగి, ఎయిర్‌ పోర్టు లోపలకు రాగానే పోలీసులు ఆమెను చుట్టుముట్టేవారట. హై ప్రొఫైల్ సెలబ్రిటీ పేరిట ఆమెను నేరుగా కారు ఎక్కించేవారట.

దీంతో తనిఖీ లేకుండానే ఆమె ఎంచక్కా ఇంటికెళ్లిపోయేది అని చెబుతున్నారు. ఇక రాణ్యాని మార్చి 4 సాయంత్రం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆమెకు మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ ఇచ్చారు. జ్యుడీషియల్ కస్టడీకి తరలించే ముందు రాణ్యాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదంతా చూసిన నెటిజన్లు ఇలా చేసేవేంటి హీరోయినూ.. ఫేమ్‌ ఇందుకు వాడుకుంటావా? అని కామెంట్లు పెడుతున్నారు.

గాయని కల్పనకు ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్పారంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.