March 22, 202504:14:12 AM

చిరు అయినా హిట్టు కొట్టి వాళ్ళలో జోష్ నింపుతారా?

Mega Heroes huge hopes on their next releases

మెగా హీరోలు  (Mega Heroes) వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తో (Waltair Veerayya) బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు (Chiranjeevi).. అదే ఏడాది ‘భోళా శంకర్’ (Bhola Shankar) అనే సినిమా చేసి డిజాస్టర్ ఇచ్చారు. ఇప్పుడు ‘విశ్వంభర’ (Vishwambhara) చేస్తున్నారు. సోసియో ఫాంటసీ మూవీ కాబట్టి.. కచ్చితంగా ఇది హిట్ అవుతుంది అని ఆశిస్తున్నారు అభిమానులు.మెగా అభిమానులు ఎక్కువ ఆశలు ఈ సినిమాపైనే పెట్టుకున్నట్టు స్పష్టమవుతుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కూడా మే 9న రిలీజ్ అవుతుంది.

Mega Heroes

Mega Heroes huge hopes on their next releases

కానీ దానిపై అభిమానులకి నమ్మకం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి 4 ఏళ్ళు టైం తీసుకున్నాడు. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా.. మధ్యలో బడ్జెట్ సమస్యల కారణంగా కొన్నాళ్ళు హోల్డ్ లో పడింది. తర్వాత క్రిష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది. రత్నం కృష్ణ (A. M. Rathnam) బ్యాలెన్స్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు. మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే తప్ప.. ఇది ఆడే సినిమా కాదు అని అభిమానులు కూడా నమ్ముతున్నారు.

మరోపక్క ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత రాంచరణ్ (Ram Charan) చేసిన ‘ఆచార్య'(ముఖ్య పాత్ర) (Acharya) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) డిజాస్టర్స్ అయ్యాయి. సాయి దుర్గ తేజ్ (Sai Dharam Tej) ‘విరూపాక్ష’ (Virupaksha) తో ఓకే చేసినా ‘బ్రో’ (BRO) తో డిజప్పాయింట్ చేశాడు. వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej) చేసిన ‘కొండపొలం’ (Konda Polam) ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) ‘ఆది కేశవ’ (Aadikeshava) వంటి సినిమాలు ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అయ్యాయి. అలాగే వరుణ్ తేజ్ (Varun Tej) చేసిన ‘గాండీవదారి అర్జున’ (Gandeevadhari Arjuna) ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) ‘మట్కా’ (Matka) వంటివి కూడా డిజాస్టర్స్ అయ్యాయి.

Mega heroes hikes her remuneration1

ఒక్క నిహారిక (Niharika Konidela) మాత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) తో నిర్మాతగా హిట్ అందుకుంది. సో మెగా హీరోలంతా (Mega Heroes) ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నారు. ఎవరొకరు హిట్టు కొడితే అందరిలోనూ జోష్ వస్తుంది. అది చిరు ‘విశ్వంభర’ నుండి మొదలవ్వాలి అనేది మెగా అభిమానుల ఆశ. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి..!

అనిల్ రావిపూడి ఎవరిని ఫైనల్ చేశాడబ్బా…!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.