March 20, 202507:44:24 PM

Akash Puri: ఆ డిజాస్టర్‌ సినిమా నుండి ఆకాశ్‌ పూరిని తీసేశారట..!

Akash Puri missed Andhrawala movie offer

రీసెంట్‌గా ఆకాశ్‌ పూరిగా (Akash Puri) పేరు మార్చుకున్న ఆకాశ్‌ ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 18 ఏళ్లు అవుతోంది. నిజానికి ఇది జరిగి 21 ఏళ్లు అయి ఉండాల్సింది. ఎందుకంటే అప్పుడు ఓ సినిమాలో ఆయనకు ఛాన్స్‌ వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. అయితే అలా వదిలేసుకోవడం వల్ల ఆయనకు ఓ మంచి కూడా జరిగింది. ఎందుకంటే వదులుకున్న సినిమా డిజాస్టర్‌గా మిగిలింది కాబట్టి. ఎంత డిజాస్టర్‌ అంటే ఆ హీరో అభిమానులకు ఓ పీడకల ఆ సినిమా.

Akash Puri

Akash Puri missed Andhrawala movie offer

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘చిరుత’ (Chirutha). ఈ సినిమాలో బాలనటుడిగా ఆకాశ్‌ కనిపించిన విషయం తెలిసిందే. చిన్ననాటి చరణ్‌గా ఆ సినిమాలో కనిపించాడు. అందులో నటనకుగాను మంచి పేరొచ్చింది కూడా. అయితే ఇదంతా ‘ఆంధ్రావాలా’ (Andhrawala) సినిమా సమయంలో జరగాల్సిందట. ఎందుకంటే ఆ సినిమాలో ఛాన్స్‌ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసేసుకున్నారట పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh). చిన్నతనం నుండి సినిమాల మధ్యలోనే పెరగడంతో ఆకాశ్‌ పూరి హీరో అవ్వాలని ఫిక్స్‌ అయ్యాడట.

Akash Puri missed Andhrawala movie offer

రోజూ సినిమా, నటుల మధ్యలోనే లైఫ్‌ సాగింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడట. అలా తన తండ్రిని పదే పదే అడగడంతో ‘ఆంధ్రావాలా’ సినిమాలో ఓ పాత్ర ఇస్తా అని చెప్పారట. సినిమా షూటింగ్‌ కోసం ఆయన రెడీ అవుతుంటే నువ్వు సినిమాలో లేవు అని పక్కన పెట్టేశారట. ఆ తర్వాత ‘చిరుత’ సినిమాతో అది సాధ్యమైంది.

ఆకాశ్‌ ఇప్పుడు ‘తల్వార్‌’ అనే ఓ పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రచారం కోసం ఇటీవల ఆకాశ్‌ ఓ టీవీ కార్యక్రమానికి వచ్చాడు. ఈ క్రమంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎందుకంటే తన చిన్నతనంలోని విషయాలు, తన కోరికలు అందులో ఉన్నాయి కాబట్టి. ఇక సినిమా సంగతి చూస్తే ఆయన ఆఖరిగా మూడేళ్ల క్రితం ‘చోర్‌ బజార్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.