
‘క’ తో (KA) సూపర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. త్వరలో ‘దిల్ రుబా’ తో (Dilruba) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వ కరుణ్ (Vishwa Karun) ఈ చిత్రానికి దర్శకుడు. రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చి 14న విడుదల కాబోతుంది. సామ్ సి ఎస్ (Sam C. S.) సంగీతంలో రూపొందిన పాటలు పర్వాలేదు అనిపించాయి. ఇప్పుడు బజ్ పెంచడానికి ట్రైలర్ ను కూడా కొద్దిసేపటి క్రితం వదిలారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 38 సెకన్లు నిడివి కలిగి ఉంది.
Dilruba Trailer Review:
‘తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయాక చెప్పే థాంక్స్ కి నా దృష్టిలో వాల్యూ లేదు’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. హీరో ప్రెజెంట్లో ఒక ప్రాబ్లమ్లో ఉండటం.. దాన్ని సాల్వ్ చేయడానికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అతను చదువుకునే కాలేజీకి రావడం.. అసలు వీళ్ళ గతం ఏంటి? ఎందుకు వీళ్ళు విడిపోయారు? అసలు హీరోకి ప్రెజెంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ కట్ చేశారు.
ఈ ట్రైలర్లో హీరో కిరణ్ అబ్బవరం చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. అలాగే గత సినిమాల్లో కంటే ఎనర్జిటిక్ గా కూడా కనిపిస్తున్నాడు. అతని డైలాగ్ డెలివరీ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) సినిమాల్లో హీరోలను గుర్తుచేసే విధంగా ఉంది. సినిమాలో చాలా విజువల్స్ పూరి సినిమాలను గుర్తుచేస్తున్నాయి అని చెప్పొచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :