
బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న కియరా అద్వాణీ (Kiara Advani) తన ప్రెగ్నెన్సీ కారణంగా మరో బిగ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కియరా, సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించగా, దీనికి సంబంధించిన ప్రభావం ఆమె కెరీర్‌పైనా పడింది. భారీ బడ్జెట్ వార్ 2, టాక్సిక్ వంటి సినిమాల్లో నటిస్తున్న కియరా, ముందుగా వీటి షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. కానీ, డాన్ 3 మాత్రం పూర్తిగా వదులుకున్నట్లు సమాచారం.
Kiara Advani
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డాన్ 3లో కియరా హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ, గర్భధారణ నేపథ్యంలో ఈ సినిమాకు సైన్ చేయడం కుదరదని ఆమె చిత్రబృందానికి తెలియజేసిందట. దీంతో మేకర్స్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్. ఇప్పటికే ఆమె నెక్ట్స్ లెవెల్ ప్రాజెక్టులు ధూమ్ 4, శక్తి షాలిని లాంటి చిత్రాల్లో నటించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే, తల్లి అయిన తర్వాత మాత్రమే కియరా ఈ సినిమాలను చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కియరా అభిమానులకు ఈ అప్‌డేట్ కొంతమంది మిశ్రమ స్పందనను కలిగించింది. ఒకవైపు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆనందపడుతూనే, మరోవైపు డాన్ 3 లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను మిస్ కావడం కొంత నిరాశ కలిగించే అంశంగా మారింది. ఇప్పటికే కియరా వార్ 2, టాక్సిక్ (Toxic) షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, మాతృత్వ విరామం తర్వాత ఆమె తిరిగి అదే ఫామ్‌లో సినిమాలు చేస్తుందా? లేదా మరింత వెనుకబడుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.
సిద్ధార్థ్, కియరా జంట 2023లో వివాహం చేసుకుంది. ప్రెగ్నెన్సీ ప్రకటనతో వీరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కియరా తిరిగి వచ్చే వరకు ఆమె స్థానాన్ని భర్తీ చేసే కొత్త హీరోయిన్లు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డాన్ 3లో ఆమె స్థానాన్ని భర్తీ చేసే కొత్త హీరోయిన్ ఎవరవుతారనేది త్వరలో తేలనుంది.