
రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా RC16 (RC 16 Movie) మీద అంచనాలు భారీగా ఉన్నాయి. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామచరణ్ కెరీర్‌లో మరో కొత్త లుక్‌ను చూపించబోతోంది. క్రీడా నేపథ్యంలో ఎమోషనల్ కాన్సెప్ట్‌ను తీసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు దివ్యేందు, శివరాజ్ కుమార్(Shiva Rajkumar) , జగపతిబాబు (Jagapathi Babu) వంటి స్టార్ క్యాస్ట్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
RC16
రామ్ చరణ్, ధోనీ మధ్య మంచి స్నేహబంధం ఉండటంతో, ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం, RC16 చిత్రబృందం దీనిపై స్పష్టత ఇచ్చింది. సినిమాలో కోచ్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ, అది ధోనీ పోషించట్లేదని, ఈ వార్త పూర్తిగా ఊహాగానమేనని చిత్ర యూనిట్ వర్గాలు క్లారిటీ ఇచ్చారు. ధోనీ ఇప్పటి వరకు సినిమాల్లో నటించకపోయినా, నిర్మాణంలో ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన, సినిమాల్లో నటించాలనే ఆలోచన లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు RC16 షూటింగ్ ముంబైలో ప్రారంభమై ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో జరగుతోంది. బుచ్చిబాబు సహజమైన వాతావరణాన్ని చిత్రీకరించేందుకు ఎక్కువగా అవుట్‌డోర్ లొకేషన్లను ఎంచుకున్నారని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా ఎమోషనల్‌గా, పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా ఉంటుందని టాక్.
ఇది రామ్ చరణ్ అభిమానులకు రొటీన్ మాస్ క్యారెక్టర్ కంటే కొత్త అనుభూతిని కలిగించేలా ఉండబోతోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు (Venkatesh Kilaru) నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రామ్ చరణ్ కొత్త పాత్ర ఎలా ఉంటుందన్నది ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని పెంచుతోంది.