
ఈ రోజుల్లో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. దానికంటే కలెక్టర్ అయిపోవడం ఈజీ అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే డైరెక్ట్ చేసిన సినిమా కూడా రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియని రోజుల్లో ఉన్నాం. అలాంటిది డెబ్యూ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్న టైంలోనే అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసుకున్నాడు శ్రీహర్ష మన్నే (Sriharsha Manne). ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ (14 Days Girlfriend Intlo) అనే యూత్- ఫుల్ సినిమాతో అతను దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Sriharsha Manne
మార్చి 7న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. స్నీక్ పీక్, ట్రైలర్ అన్నీ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఈ వీకెండ్ కి మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయించే కామెడీ ఇందులో పుష్కలంగా ఉంది అని ప్రమోషనల్ కంటెంట్ తో ప్రూవ్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే విధంగా కూడా ఈ సినిమా ఉంటుందట. ఇక శ్రీహర్ష మన్నే తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అనుకున్న బడ్జెట్లో సినిమాని కంప్లీట్ చేయడమే కాకుండా.. సినిమాకి కావలసిన బజ్ కూడా తెప్పించాడు.
అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియాలో స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో శిక్షణ తీసుకున్న శ్రీహర్ష (Sriharsha Manne).. అటు తర్వాత ‘తమడా మీడియా’ అనే కంటెంట్ & నిర్మాణ సంస్థలో ‘పెళ్లి గోల’ వంటి సిరీస్..లకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. అలాగే ‘లిప్సిక’ ‘పక్కింటి కుర్రాడు’ వంటి షార్ట్ ఫామ్ ఆఫ్ కంటెంట్..లకు డైరెక్షన్ కూడా చేశాడు. తర్వాత పూరీ జగన్నాథ్ వద్ద శిష్యరికం కూడా చేసి వచ్చాడు ఈ కుర్ర డైరెక్టర్.
పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన తనయుడు ఆకాష్ పూరి (Akash Puri) హీరోగా నటించిన ‘రొమాంటిక్’ (Romantic) సినిమాకి శ్రీహర్ష మన్నే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో తన పనితనంతో పూరీని కూడా ఇంప్రెస్ చేశాడు. ఇక దర్శకుడిగా మారి చేసిన డెబ్యూ మూవీ ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి… తనకు మంచి గుర్తింపు తీసుకొస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు శ్రీహర్ష.