
మహేష్‌బాబు (Mahesh Babu) అభిమానులకు ఈ మధ్య వరుస గుడ్ న్యూస్‌లు వస్తున్నాయి. సినిమాకు (SSMB29) సంబంధించి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓవైపు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రూపొందించిన సెట్‌లో తొలి షెడ్యూల్ జరుగుతుండగా, మరోవైపు సినిమా కాస్టింగ్‌ను ఫైనలైజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ వర్క్‌ను కూడా స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. తాజాగా సినిమాలో మహేష్ పేరు ఒకటి బయటకొచ్చింది. రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో మహేష్‌బాబు – ప్రియాంక చోప్రా (Priyanka Chopra) – పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న (ఇంకా ఆఖరి రెండు పేర్లు అధికారికం కాదు) కొత్త సినిమా చిత్రీకరణ రెండో షెడ్యూల్ ఈ రోజు ఒడిశాలో ప్రారంభమైంది.
SSMB29
దీని కోసం టీమ్ అంతా బుధవారం కొరాపుట్‌కి విమానంలో చేరుకుంది. ఈ క్రమంలో మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫొటోలు వైరల్ కూడా అయ్యాయి. ప్రస్తుతం టీమ్ కొరాపుట్‌కి దగ్గరలోని దేవ్‌మాలి పర్వతంపై బస చేస్తున్నారు. తోలోమాలి, దేవ్‌మాలి, మాచ్‌ఖండ్ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే రాజమౌళి అండ్ టీమ్ లొకేషన్లను ఫైనలైజ్ చేసింది. తోలోమాలి పర్వతంపై ఇప్పటికే ప్రత్యేక సెట్‌ను రూపొందించారు.
అక్కడే ఈ నెల 28 వరకు షూటింగ్ ఉంటుందని సమాచారం. అన్నట్లు తొలి షెడ్యూల్‌లో మహేష్ – ప్రియాంకతోపాటు నానా పటేకర్ కూడా నటించారు అని సమాచారం. ఈ విషయం ఇలా ఉంచితే సినిమాలో మహేష్ బాబు పేరు రుద్ర అని చెబుతున్నారు. అయితే ఇదే పేరు సినిమాకు పెడతారు అని కూడా వార్తలొచ్చినా.. అందుకే నిజం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాను ప్రపంచవ్యాప్తం చేయడానికి ఓ ఇంగ్లిష్ పేరు అయితే బాగుంటుంది అని టీమ్ ప్లాన్ చేస్తోంది.
కాబట్టి రుద్ర పేరుగా ఉండదు. ఇక గతంలో పుకార్లు వచ్చినట్లు ‘గరుడ’ కూడా కష్టమే అంటున్నారు. ఈ విషయాల్లో క్లారిటీ రావాలంటే రాజమౌళి తన మాండేటరీ ప్రెస్‌మీట్ పెట్టాల్సిందే. మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆ ప్రెస్ మీట్ పెడతారు అంటున్నారు. అయితే దానికి ఇంకా చాలా రోజులుంది. ఈ నేపథ్యంలో రెండో షెడ్యూల్ తర్వాత మీడియా ముందుకు వస్తారనే మరో పుకారూ ఉంది.