
2022 అక్టోబర్లో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా మొదలైంది.ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి మారుతి (Maruthi Dasari) దర్శకుడు. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇచ్చింది లేదు. దీంతో కోవిడ్ తర్వాత ప్రభాస్ నుండి ఫాస్ట్ గా వచ్చే సినిమా ఇదే అవుతుంది అని అంతా అనుకున్నారు. 2023 లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు అని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.
The Raja Saab
సినిమాకి పాన్ ఇండియా మెరుపులు దిద్దడం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. అయినప్పటికీ 2025 ఏప్రిల్ 10 న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అది కూడా వర్కౌట్ అవ్వడం లేదు. ఈ సినిమా మరింత ఆలస్యం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ‘ది రాజాసాబ్’ (The Raja Saab) టీం దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా.. సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘జాక్’ వంటి సినిమాలు ఏప్రిల్ 10 కి వస్తున్నట్టు ప్రకటించడంతో విషయం అర్ధం చేసుకోవచ్చు.
మరోపక్క ‘ది రాజాసాబ్’ ప్రాజెక్టు మొదలై 850 రోజులు దాటింది అని కొందరు అంటున్నారు. 2022 అక్టోబర్ నుండి అనుకుంటే వాళ్ళు చెప్పింది కరెక్టే. కానీ ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సినిమాకి సంబంధించిన లీకులు ‘రాధే శ్యామ్’ సినిమా రిలీజ్ టైంలోనే సంగీత దర్శకుడు తమన్ ఇచ్చాడు. ‘రాధే శ్యామ్’ (Radhe Shaym) రిలీజ్ అయ్యింది మార్చి 11 నే. అంటే ‘ది రాజాసాబ్’ మొదలయ్యి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది అనుకోవచ్చు. 9 నెలల్లో రిలీజ్ అవుతుంది అనుకున్న ప్రభాస్ సినిమా కూడా 3 ఏళ్ళు టైం తీసుకోవడం గమనార్హం.