
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) .. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మొన్నామధ్య వరుస ప్లాపులతో సతమతమైన ఇతను ‘క’ (KA) సినిమాతో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఆ సినిమాతో అతను రూ.50 కోట్ల క్లబ్లో చేరి.. మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు. ఇక అతని కొత్త సినిమా ‘దిల్ రుబా’ (Dilruba) కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. వాస్తవానికి ఇది ‘క’ కంటే ముందే కంప్లీట్ అయ్యింది.
Kiran Abbavaram
కానీ బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ అయిపోవడం, ఆ టైంలో కిరణ్ మార్కెట్ డల్ గా ఉండటం వల్ల.. రిలీజ్ డిలే అయ్యింది. అదే టైంలో ‘క’ రిలీజ్ అవ్వడం.. అది సూపర్ హిట్ అయ్యి లాభాలు తీసుకురావడంతో.. ‘దిల్ రుబా’ ని కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. మార్చి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఇదిలా ఉండగా.. కిరణ్ అబ్బవరం పేరు మార్చుకున్నట్టు నిన్నటి నుండి చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. నిన్న జరిగిన ‘దిల్ రుబా’ ట్రైలర్ లాంచ్లో కిరణ్ అబ్బవరం కి ఒక ప్రశ్న ఎదురైంది. ‘క’ సినిమా టైటిల్ కార్డ్స్ లో ‘KIRAN ABBAVA’RAM’ ‘ లో ‘RAM’ ని హైలెట్ చేశారు.
‘దిల్ రుబా’ కోసం కూడా కిరణ్ అబ్బవరం పేరు అలానే పడుతుందట. సెంటిమెంట్ గా భావించి కిరణ్ ‘క’ సినిమాకి ‘RAM’ ని హైలెట్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అది అతనికి కలిసొచ్చినట్టు కూడా స్పష్టమవుతుంది. ఇక నుండి ప్రతి సినిమాకి అదే పద్ధతిని అతను ఫాలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.