March 17, 202501:33:07 AM

బాధితుల పట్ల వివక్షపై షిండే దృష్టికి : చిరంజీవి

న్యూఢిల్లీ, జూన్ 27 :  ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన బాధితులను ఆదుకునే విషయంలో తెలుగు వారి పట్ల చూపుతున్న వివక్షను తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే దృష్టికి తీసుకు వెళ్లానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన యాత్రుకులను తాము సురక్షితంగా వారి వారి స్వస్థలాలకు చేర్చుతామని  హామీ ఇచ్చారు.

గతంలో ఎన్నడూ జరగనంత విపత్తు జరిగిందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌కు పర్యాటక శాఖ నుండి సహాయం చేశామన్నారు. వరద బాధితుల విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

చిరంజీవి తెలంగాణపై మాట్లాడుతూ పార్టీ అధిష్టానందే అంతిమ నిర్ణయమని చెప్పారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే అంచనా తనకు లేదన్నారు. కాగా గురువారం మధ్యాహ్నం చిరంజీవి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డెహ్రాడూన్ వెళ్లనున్నారు.

Tags: News, Telugu News, Andhra News
Labels: ,

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.