Allari Naresh: నరేశ్‌ ఇలా అనేశాడేంటి.. అయితే ఆ ఆశ ఇక తీరదా?

అల్లరిని ఇంటి పేరు చేసుకున్న (Allari Naresh) నరేశ్‌… ఆ స్టయిల్‌ సినిమాలు ఇటీవల బాగా తగ్గించేశారు. ఎమోషనల్‌ కంటెంట్‌తోనూ తాను మెప్పించగలను అని నిరూపించారు. అయితే ఈ క్రమంలో అలాంటి కథలో ఇబ్బంది కూడా పడ్డారు. దీంతో ఇప్పుడు కొంత విరామం తర్వాత ఆ జోనర్‌లోకి వచ్చి (Aa Okkati Adakku) ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేశారు. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రీమేక్‌ల గురించి నరేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొంతమంది అనుకుంటున్నట్లు గతంలో వచ్చిన (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’ , ఈ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు. జీవితంలో స్థిరపడకుండా పెళ్లి చేసుకున్న యువకుడి కథతో నాటి చిత్రం తెరకెక్కిందని, లైఫ్‌లో సెటిల్‌ అయినా పెళ్లికాని యువకుడి కథతో ఈ కొత్త తీశామని చెప్పారు. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, పేరడీ సన్నివేశాలు లేకుండా ఆరోగ్యకరమైన వినోదాన్ని ఈ సినిమాతో ఇస్తున్నామని చెప్పారు.

‘కితకితలు’ సినిమాని ఈ రోజుల్లో తీసుకొస్తే బాడీ షేమింగ్‌ అని అంటారని, రంగు, ఎత్తు, బరువు లాంటి సెన్సెటివ్‌ అంశాల గురించి ఇప్పుడు మాట్లాడలేం అని అలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదో చెప్పేశాడు నరేశ్‌. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా కామెడీ సృష్టించడం కష్టమని, అలాంటి స్క్రిప్టులను ఎంపిక చేసుకోవడానికి సమయం పడుతుందని అన్నారు. అందుకే తన నుండి కామెడీ జోనర్‌ సినిమాలు రావడానికి సమయం పడుతోంది అని చెప్పారాయన.

ఇక పాత సినిమాలు ముఖ్యంగా ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘జంబలకిడి పంబ’ లాంటి చిత్రాలను తీయొచ్చు కదా అనేలా అడిగితే… ‘అలాంటి సినిమాలను టచ్‌ చేయకూడదనేది తన అభిప్రాయమని తేల్చేశారు నరేశ్‌. దీంతో ఇక అలాంటి కథల్ని నరేశ్‌ చేస్తే చూడాలని వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది అని చెప్పాలి. అయితే అలాంటి కొత్త కథ వస్తే చేస్తాడు అని చెప్పొచ్చు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.