March 23, 202507:43:51 AM

Director Bobby: మీ కాంబో ఆల్వేస్ బ్లాస్ట్ హరీష్ బ్రో.. బాబీ కామెంట్స్ వైరల్!

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)  సినిమాపై పవన్ ఫ్యాన్స్ లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. భగత్స్ బ్లేజ్ పేరుతో విడుదలైన గ్లింప్స్ కు ఇప్పటివరకు 3.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ గ్లింప్స్ గురించి స్టార్ డైరెక్టర్ బాబీ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భగత్స్ బ్లేజ్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉందని పవన్(Pawan Kalyan) , దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని బాబీ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాబీ చేసిన ఈ పోస్ట్ కు 2500కు పైగా లైక్స్ వచ్చాయి. బాబీ సైతం ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. బాబీ బాలయ్య కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

బాలయ్య(Balakrishna) బాబీ (Bobby)  కాంబో మూవీ నుంచి కూడా తాజాగా గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాబీ పవన్ కళ్యాణ్ మూవీ గురించి పాజిటివ్ గా స్పందించడంతో పవన్ ఫ్యాన్స్ సైతం ఎంతో సంతోషిస్తున్నారు. బాలయ్య బాబీ మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీ షూట్ ఈ ఏడాది సెకండాఫ్ లో మొదలుకానుందని సమాచారం అందుతోంది. 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ రోల్ ఈ సినిమాలో పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.