March 23, 202508:41:20 AM

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ఊహించని స్థాయిలో మార్కెట్ ను కలిగి ఉన్న హీరోలలో (Siddu Jonnalagadda) సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. మరికొన్ని రోజుల్లో టిల్లు స్క్వేర్ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. (DJ Tillu) డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల గురించి రూమర్లు రావడం సర్వ సాధారణం అనే సంగతి తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డ ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నారని సోషల్ మీడియా వేదికగా రూమర్లు తెగ వైరల్ కావడం జరిగింది. అయితే ఈ రూమర్లకు సంబంధించి ప్రశ్నలు ఎదురు కాగా సిద్ధు జొన్నలగడ్ద సోదరుడు చైతు జొన్నలగడ్డ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్య లేదని స్టార్ హీరోను పెళ్లి చేసుకుంటేనే కదా సమస్య అంటూ చైతు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు. ఎవరిని పెళ్లి చేసుకుంటాడో తెలీదు కానీ సిద్ధు జొన్నలగడ్డకు పెళ్లిపై ఆసక్తి మాత్రం ఉందని చైతు జొన్నలగడ్డ వెల్లడించారు. 2025లో సిద్ధు పెళ్లి జరుగుతుందని చెప్పలేనని ఆ సమయానికి అన్నీ కుదిరితే మాత్రం పెళి జరిగే ఛాన్స్ ఉందని ఆయన కామెంట్లు చేశారు.

ఈ నెల 18వ తేదీ నాటికి టిల్లు స్క్వేర్ మూవీ షూట్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ నెలలో విడుదలైన సినిమాలలో గామి మాత్రమే భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండగా టిల్లు స్క్వేర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేశారని తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ బడ్జెట్ 45 కోట్ల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.