March 22, 202501:34:14 AM

Coolie: రజినీకాంత్ ‘కూలీ’ టైటిల్ టీజర్లో దీనిని గమనించారా!

లోకేష్ కనగరాజ్ కి (Lokesh Kanagaraj) ఓ సెంటిమెంట్ ఉంది. ఏ సినిమాకి అయినా ముందుగా టైటిల్ టీజర్ ను విడుదల చేసి.. ఆ సినిమా కథా నేపధ్యాన్ని తెలియజేయడం అతనికి అలవాటు. ‘విక్రమ్’ (Vikram) ‘లియో’ (LEO) ల విషయంలో ఈ సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు. ఇప్పుడు రజినీకాంత్ తో (Rajnikanth) చేయబోతున్న సినిమా విషయంలో అతను ఇదే చేస్తున్నాడు. రజినీకాంత్ తన 171 (Coolie) వ సినిమాని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ టీజర్ ను తాజాగా విడుదల చేశారు.

ఈ సినిమాకి ‘కూలి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఈ టైటిల్ టీజర్ ను వదలడం జరిగింది. టీజర్ దాదాపు 3 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇందులో బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ముఠా ముందుగా కనిపించింది. వారిని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తిగా రజినీకాంత్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి నుండే ప్రత్యర్థులను తన స్టైల్లో చితక్కొడుతూ స్వాగ్ ను చూపించారు రజినీ. ఆయన లుక్ కూడా అదిరింది. అనిరుధ్ (Anirudh Ravichander) అందించిన నేపధ్య సంగీతం మరోసారి హైలెట్ అయ్యింది అని చెప్పాలి.

అయితే కథలో కొంచెం ‘విక్రమ్’ ‘కెజీఎఫ్’ (KGF) షేడ్స్ ఉండబోతున్నాయి అనే ఆలోచన కలిగించే విధంగా ఈ టైటిల్ టీజర్ ను కట్ చేశారు. లోకేష్ కనగరాజ్ గత సినిమా ‘లియో’ భారీ వసూళ్లు సాధించింది కానీ.. కంటెంట్ పరంగా అది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ ‘జైలర్’ (Jailer) తో బ్లాక్ బస్టర్ కొట్టి రజినీకాంత్ ఫామ్లోకి వచ్చారు. కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.