March 13, 202505:20:05 PM

సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు బుచ్చిబాబు తండ్రి మృతి.!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. ఈ ఏడాది అప్పుడే నిర్మాత ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu)  తండ్రి, సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్, త్రినాథ్ రావు నక్కిన (Trinadha Rao Nakkina)  తండ్రి నక్కిన సూర్యారావు, సీరియల్ నటి పవిత్ర జయరాం, మరో సీరియల్ నటుడు చందు, దర్శకుడు సూర్య ప్రకాష్ వంటి వారు మృతి చెందారు. ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పెదకాపు అనారోగ్యంతో కన్నుమూసినట్టు సమాచారం. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన.. హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చారు.అయితే పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూనే మరణించినట్లు సమాచారం. ట్రీట్మెంట్ కి ఆయన శరీరం సహకరించకపోవడం వల్లే ఈ విషాదం చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది.

విషయం తెలుసుకున్న వెంటనే బుచ్చిబాబు.. ఇంటికి దర్శకులు సుకుమార్ (Sukumar) వంటి సినీ ప్రముఖులు పరామర్శ కొరకు వెళ్లినట్టు సమాచారం అందింది. ఈరోజు కాకినాడలోని వారి ఇంటి వద్ద అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక బుచ్చిబాబు రాంచరణ్ తో (Ram Charan) సినిమా సెట్ చేసుకుని వాటి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టైంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం నిజంగా విషాదకరమనే చెప్పాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.