March 22, 202505:16:31 AM

Chiranjeevi: ఆ ముగ్గురు దర్శకులపై ఫోకస్ పెట్టిన మెగాస్టార్.!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాతో బిజీగా గడుపుతున్నారు. ‘భోళా శంకర్’ (Bhola Shankar) ఘోరంగా ప్లాప్ అయ్యింది. రీ ఎంట్రీ తర్వాత చిరు నుండి వచ్చిన సినిమాల్లో ఏ సినిమా కూడా అంత తక్కువ కలెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ చిరు జడ్జిమెంట్ పై కూడా అనుమానం వచ్చేలా చేసింది ఆ సినిమా ఫలితం. దీంతో చిరు తన నెక్స్ట్ సినిమాల విషయంలో అప్రమత్తం అయ్యారు. కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని పక్కన పెట్టేశారు.

‘విశ్వంభర’ ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) ఈ సినిమాకి దర్శకుడు. 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే వి.ఎఫ్.ఎక్స్ వర్క్ అనుకున్న కంప్లీట్ అవ్వకపోతే.. ఆ టైంకి రిలీజ్ చేయడం చాలా కష్టం. మరోపక్క ఈ సినిమా తర్వాత చిరు చేయబోయే సినిమాలు ఏంటి అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ షూటింగ్ దశలో ఉండగానే చిరు 3 సినిమాలు అనౌన్స్ చేసే అవకాశం ఉందట. అవి ఎవరితో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఇటీవల చిరుకి చాలా మంది కథలు చెప్పారు. అందులో ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) దర్శకుడు అనుదీప్ (Anudeep Kv) , ‘కార్తికేయ 2 ‘ (Karthikeya 2) దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) వంటి వారు ఉన్నారు. అలాగే హరీష్ శంకర్ (Harish Shankar)కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు వినికిడి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.