March 23, 202508:41:17 AM

Deepika Padukone: ప్రభాస్ సినిమాలో నటిస్తున్న దీపికకు ఆ హీరో అంటే ఇంత అభిమానమా?

కల్కి (Kalki 2898 AD) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కల్కి మూవీపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలను నెలకొనగా ఈ సినిమా ఆ అంచనాలను నిజం చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో టికెట్ రేట్లు ఉండటం గమనార్హం. ఐశ్వర్య అనే కన్నడ సినిమాతో దీపికా పదుకొనే (Deepika Padukone) కెరీర్ మొదలైంది. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ గా నిలిచిన మన్మథుడు మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.

మన్మథుడు మూవీలో సోనాలి బింద్రే (Sonali Bendre) పోషించిన పాత్రను ఐశ్వర్య మూవీలో దీపికా పదుకొనే పోషించారు. ఓం శాంతి ఓం సినిమాతో దీపికా పదుకొనే కెరీర్ మలుపు తిరిగింది. చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్ సినిమాలు సైతం సక్సెస్ సాధించి ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యాయి. పలు హిస్టారికల్ సినిమాలలో సైతం నటించి ఆమె సత్తా చాటారు. అయితే చాలా సందర్భాల్లో దీపికా పదుకొనే మహేష్ బాబు (Mahesh Babu) అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు.

స్టార్ హీరో రానా (Rana) దీపికకు క్లోజ్ ఫ్రెండ్ కావడం గమనార్హం. దీపికా పదుకొనే మితభాషి కాగా ఆమె మహారాష్ట్రలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 2022 సంవత్సరంలో ప్రపంచంలోని పది మంది అందమైన మహిళల్లో ఆమె ఒకరిగా నిలవడం గమనార్హం. రణ్ వీర్ సింగ్ ను  (Ranveer Singh) పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.

కల్కి సినిమాతో దీపికా పదుకొనే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కల్కి 2898 ఏడీ ప్రభాస్, దీపిక కోరుకున్న భారీ హిట్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది. దీపికా పదుకొనే పారితోషికం పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.