March 21, 202512:41:36 AM

Harish Shankar: రవితేజ సినిమా అవ్వగానే.. మరో అన్నతో.. హరీశ్‌ శంకర్‌ ప్లాన్‌ ఇదేనా?

మామూలుగా అయితే టాలీవుడ్‌లో హీరోలు అభిమానంగా అన్నయ్య అని పిలుచుకునేది చిరంజీవిని (Chiranjeevi) మాత్రమే. అంతకుముందు ఎన్టీఆర్‌ను అన్నగారు అనేవారు అనుకోండి. రీసెంట్‌ టైమ్‌లో ‘అన్నయ్య’ అనే పిలుపు అందుకుంటున్న మరో హీరో రవితేజ. కొత్త దర్శకులు, కాస్త సీనియారిటీ ఉన్న దర్శకులు కూడా రవితేజను (Ravi Teja) అన్న అని పిలుస్తుంటారు. ఇదంతా ఓకే కానీ.. అసలు విషయానికొద్దాం.. అదే తమ్ముడు కాదు అన్నే! హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) ప్రస్తుతం రవితేజతో ‘మిస్టర్‌ బచ్చన్‌’ అనే సినిమా చేస్తున్నాడు.

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘రెయిడ్‌’ సినిమాకు ఇది రీమేక్‌ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ.. విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హరీశ్‌ శంకర్‌ నెక్స్ట్ సినిమా ఏంటి? అనే చర్చ మొదలైంది. అలా అని ఆయన చేతిలో సినిమాలు లేవా అంటే ఇన్‌స్టంట్‌గా ఒకటి ఉంది. అయితే ఇప్పుడు అదే మొదలవుతుందా? లేదా? అనేదే ప్రశ్న. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) అనే సినిమాను ఇప్పటికే హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు.

అయితే పవన్‌ రాజకీయం పడవ మీద ఉండటంతో సినిమాలకు హోల్డ్‌ చెప్పారు. దీంతో హరీశ్‌ శంకర్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ సినిమా అయిపోతోంది, అలాగే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి పవన్‌ డిప్యూటీ సీఎం అయిపోయారు. దీంతో ఆ సినిమా మళ్లీ మొదలుపెడతారు అని అనుకుంటున్నారంతా. అయితే, పవన్‌ ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి వచ్చినా వెంటనే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ స్టార్ట్‌ చేసే పరిస్థితి లేదట.

‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) , ‘ఓజీ’ (OG Movie) సినిమాల తర్వాతనే ‘ఉస్తాద్‌..’ పనులు అంటున్నారు. దీంతో హరీశ్‌ శంకర్‌ ఈ గ్యాప్‌లో మరో సినిమా కానిచ్చేద్దాం అని చూస్తున్నారట. ఈ క్రమంలో పవన్‌ అన్న చిరంజీవితో ఓ సినిమా చేద్దామని ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో ఓసారి చిరు కూడడా హరీశ్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. చూడాలి మరి ఏమవుతుందో?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.