March 23, 202507:18:31 AM

Nag Ashwin: నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్.. వైరల్ అవుతున్న ఇన్స్టా స్టేటస్.!

‘ఎవడే సుబ్రహ్మణ్యం’  (Yevade Subramanyam) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు నాగ్ అశ్విన్  (Nag Ashwin) . శేఖర్ కమ్ముల శిష్యుడు ఇతను. అశ్వినీదత్ కి (C. Aswani Dutt) చిన్నల్లుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తర్వాత సావిత్రి గారి జీవిత కథతో ‘మహానటి’ (Mahanati) అనే సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది ఆ సినిమా. కనీసం ట్రైలర్ ని కూడా విడుదలకు ముందు రిలీజ్ చేయలేదు. అయినా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం ఒక బయోపిక్ గా మాత్రమే ఆ సినిమా గురించి చెప్పుకుంటే సరిపోదు.

ఆ సినిమా ఒక ఇన్స్పిరేషన్. సావిత్రి జీవితం మొత్తం కళ్ళముందే జరుగుతున్నట్టు.. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత బయోపిక్..లకు డిమాండ్ పెరిగింది. కానీ ‘మహానటి’   స్థాయిలో ఏ బయోపిక్కు విజయాన్ని సాధించింది లేదు. కాబట్టి.. బయోపిక్ సినిమాల్లో ‘మహానటి’ ని గేమ్ ఛేంజర్ మూవీగా అంతా చెప్పుకుంటారు. సరే 2 క్లాస్ సినిమాలు తీశాడు కాబట్టి.. మూడో సినిమా కూడా అలాంటిదే తీస్తాడు అని అంతా అనుకున్నారు.

కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ‘ప్రాజెక్టు కె’ ని స్టార్ట్ చేశాడు. ‘కల్కి 2898 ad’  (Kalki 2898 AD)  పేరుతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. రూ.500 కోట్ల బడ్జెట్ తో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాడు ఇతను. ‘కల్కి..’ కోసం ఇతను ఎంత కష్టపడ్డాడు అంటే చెప్పులు కూడా అరిగిపోయినా పట్టించుకోకుండా..

వాటినే ధరించి తిరిగేంత కష్టపడ్డాడు. అవును తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్.. తన ఇన్స్టాగ్రామ్లో తన అరిగిపోయిన చెప్పులను ఫోటో తీసి స్టోరీగా పెట్టాడు. అది చూసిన నెటిజన్లు అంతా ఆశ్చర్యపోతున్నారు. అతని సింప్లిసిటీకి, డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.