March 22, 202509:06:36 AM

Bimbisara Prequel Story: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ప్రీక్వెల్ స్టోరీ లైన్ ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జయాపజయాలతో సంబంధం లేకుండా కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram)  గుర్తింపును సంపాదించుకున్నారు. బింబిసార (Bimbisara)  సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. బింబిసార ప్రీక్వెల్ కళ్యాణ్ రామ్ 22వ సినిమాగా తెరకెక్కనుండగా అనిల్ పాదూరి (Anil Paduri) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు రొమాంటిక్ అనే సినిమాకు దర్శకత్వం వహించగా ఆ సినిమా ఫ్లాపైంది. మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) కొన్ని కారణాల వల్ల బింబిసార ప్రీక్వెల్ సినిమాకు డైరెక్టర్ గా తప్పుకోవడంతో గత కొన్నేళ్లుగా కళ్యాణ్ రామ్ తో ట్రావెల్ అవుతున్న అనిల్ పాదూరికి ఈ సినిమాకు పని చేసే అవకాశం దక్కింది.

ఫ్లాప్ దర్శకుడు అయినప్పటికీ టాలెంట్ ను నమ్మి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు పని చేసే ఛాన్స్ ఇచ్చినట్టు భోగట్టా. అనిల్ పాదూరి స్వతహాగా విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ కావడం గమనార్హం. బింబిసార కంటే ముందు ప్రజల్లో మంచి పేరును సొంతం చేసుకున్న ఒక ధర్మ ప్రభువు కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. బింబిసార ప్రీక్వెల్ సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని భోగట్టా.

బింబిసార ప్రయాణం మొదలు కావడానికి మూలంకు సంబంధించిన వివరాలను ఈ సినిమాలో ప్రస్తావించనున్నారని భోగట్టా. కళ్యాణ్ రామ్ తన సినిమాలను సొంత బ్యానర్లపై నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బయటి బ్యానర్లలో నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడం కూడా ఇందుకు సంబంధించిన ఒక కారణమని సమాచారం అందుతోంది.

కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఉండటం కళ్యాణ్ రామ్ కు ప్లస్ అవుతోంది. కళ్యాణ్ రామ్ తన అభిరుచికి అనుగుణంగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.