March 28, 202503:14:56 AM

Kalki 2898 AD: అప్పటివరకు బాక్సాఫీస్ వద్ద కల్కి జోరు.. అలా జరగడమే ప్రభాస్ మూవీకి ప్లస్!

ప్రభాస్  (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ ఇప్పటికే 900 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీన ఇండియన్2 (Bharateeyudu 2) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కల్కి సినిమపై ఎఫెక్ట్ పడుతుందా అనే ప్రశ్నకు ఇండియన్2 విడుదలైనా కల్కి స్పీడ్ కు బ్రేకులు వేయడం కష్టమేనని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు టికెట్ రేట్లు తగ్గించడం కల్కి మూవీకి ప్లస్ అవుతోంది.

టికెట్ రేట్ల పెంపు వల్ల ఇప్పటివరకు కల్కి సినిమాను చూడని వాళ్లు థియేటర్లలో ప్రస్తుతం సినిమా చూస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్లు అమాంతం పెరిగాయి. కల్కి సినిమాను థియేటర్లలో మళ్లీమళ్లీ చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. కల్కి సినిమాను ఒకసారి చూసినా కొన్ని సీన్లను అర్థం చేసుకోవడం సులువు కాదు. అందువల్ల చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

కల్కి 2898 ఏడీ ఫుల్ రన్ కలెక్షన్లు 1200 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్ లో మరికొన్ని వారాల పాటు ఈ సినిమా హవా కొనసాగనుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను మించి కల్కి 2898 ఏడీ హిట్ గా నిలిచింది. 2024 బిగ్గెస్ట్ హిట్ గా కూడా కల్కి సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ది రాజా సాబ్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ త్వరలో రానున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మారుతి కెరీర్ కు ఈ సినిమా కీలకమని చెప్పవచ్చు. ప్రభాస్ సినిమాలన్నీ కనీసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.