March 23, 202508:33:05 AM

Nani, Janhvi Kapoor: నాని- శ్రీకాంత్ ఓదెల – జాన్వీ .. క్రేజీ కాంబో ఇది..!

నేచురల్ స్టార్ నాని (Nani)  గత ఏడాది ‘దసరా’ (Dasara) ‘హాయ్ నాన్న’ (Hi Nanna) వంటి హిట్లు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న నాని..ఆ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. శైలేష్ కొలను (Sailesh Kolanu)   దర్శకత్వంలో ‘హిట్ 3’ (HIT2)  సెట్స్ పైకి వెళ్తుందనే ప్రచారం జరుగుతుంది. ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నానినే ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. కానీ దాని పై ఎటువంటి క్లారిటీ రాలేదు.

మరోపక్క నాని … ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యారు. ‘ఎస్.ఎల్.వి.సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు టాక్. ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రూపొందనుంది అని సమాచారం. ‘దసరా’ లో సింగరేణి కుర్రాడిగా కనిపించిన నాని… ఈ సినిమాలో పక్కా హైదరాబాదీ కుర్రాడిలా కనిపిస్తాడని టాక్. ఇక ఈ చిత్రంలో నానికి జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుందట.

ఇప్పటికే ఆమె ఎన్టీఆర్ (Jr NTR)   ‘దేవర’ (Devara) , రాంచరణ్ (Ram Charan)  – బుచ్చిబాబు (Buchi Babu Sana)..ల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాని సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో కూడా ‘దసరా’ లోకి మాదిరే హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. త్వరలోనే చిత్ర బృందం జాన్వీ కపూర్ గురించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.