March 23, 202507:26:26 AM

Krishna Vamsi: పవన్ తో మూవీ అలా మిస్సైందన్న కృష్ణవంశీ.. బ్యాడ్ లక్ అంటూ?

మెగా హీరోలతో మంచి అనుబంధం ఉన్న దర్శకులలో కృష్ణవంశీ (Krishna Vamsi)  ఒకరు. మురారి (Murari) మూవీ రీరిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తున్న కృష్ణవంశీ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ (Ram Charan)  తో గోవిందుడు అందరివాడేలే (Govindudu Andarivadele) సినిమా తెరకెక్కించి అబవ్ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న కృష్ణవంశీ పవన్ కళ్యాణ్ తో  (Pawan Kalyan)  ఒక సినిమా చేయాలని తాను అనుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని ఆయన వెల్లడించారు. పవన్ తో సినిమా చేయాలని అనుకున్నా ఆ ఛాన్స్ మిస్ అయిందని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.

Krishna Vamsi

పవన్ కళ్యాణ్ కొరకు సిద్ధం చేసిన కథతో సినిమా తెరకెక్కి ఉంటే ఆ సినిమా కచ్చితంగా సంచలనం అయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాడ్ లక్ వల్ల పవన్ కళ్యాణ్ తో సినిమా తెరకెక్కించాలని భావించినా సాధ్యం కాలేదని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. కృష్ణవంశీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మురారి మూవీ రీరిలీజ్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా విడుదల కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమా కూడా రీరిలీజ్ లో హిట్టవుతుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేము. అయితే మురారి మూవీ మాత్రం రీరిలీజ్ లో అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తోంది. కృష్ణవంశీ ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చిందని చెప్పవచ్చు.

ఈ మధ్య కాలంలో సరైన విజయాన్ని అందుకోని కృష్ణవంశీ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కృష్ణవంశీ రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. కృష్ణవంశీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని భోగట్టా. కృష్ణవంశీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.

ఓటీటీ రైడ్‌కి సిద్ధమవుతున్న భైరవ అలియాస్ కర్ణ.. ఎప్పటి నుండంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.