March 28, 202503:14:46 PM

Srimanthudu Collections: ‘శ్రీమంతుడు’ కి 9 ఏళ్ళు.. టోటల్..గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2014 మహేష్ బాబుకి (Mahesh Babu) కలిసి రాలేదు. ఆ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) , దసరాకి కొద్దిరోజుల ముందు రిలీజ్ అయిన ‘ఆగడు’ (Aagadu) వంటి సినిమాలు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని దర్శకుడు కొరటాల శివతో (Koratala Siva) ‘శ్రీమంతుడు’ (Srimanthudu) చేశాడు మహేష్. మొదట ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు లేవు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక బజ్ ఏర్పడింది.

Srimanthudu 

srimanthudu

ఇక సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. ఇక 2015 ఆగస్టు 7న రిలీజ్ అయిన ఈ సినిమా యునానిమస్ గా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఒకసారి ‘శ్రీమంతుడు’ (Srimanthudu) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 22.34 cr
సీడెడ్  9.40 cr
వైజాగ్ 5.63 cr
ఈస్ట్ 6.12 cr
వెస్ట్ 4.37cr
కృష్ణా 4.37 cr
గుంటూరు 5.75 cr
నెల్లూరు 2.19 cr
ఏపీ + తెలంగాణ 60.17 cr
కర్ణాటక 7.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  1.05 cr
తమిళనాడు (తెలుగు వెర్షన్) 1.05 cr
రెస్ట్ ఆఫ్ వరల్డ్ 2.29 cr
తమిళనాడు (తమిళ్ వెర్షన్) 0.68 cr
కేరళ (తమిళ్ వెర్షన్)  0.39 cr
యూ.ఎస్.ఏ 12.50 cr
వరల్డ్ వైడ్ టోటల్ 85.20 cr (Share)

‘శ్రీమంతుడు’ చిత్రం రూ.57 కోట్ల(షేర్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 85.20 కోట్ల షేర్ ని రాబట్టి… అంటే 28 కోట్ల వరకు ప్రాఫిట్స్ ను అందించింది. నెట్ పరంగా చూసుకుంటే ‘బాహుబలి ది బిగినింగ్’  (Baahubali)  తర్వాత రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఇదే.

హాలీవుడ్‌ హీరోయిన్లే కావాలట… రాజమౌళికి మహేష్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌లు

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.