March 25, 202510:14:30 AM

Nag Ashwin: నాగ్ అశ్విన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడుగా..!

ప్రభాస్ (Prabhas) , నాగ్ అశ్విన్ (Nag Ashwin)   ..ల కలయికలో ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD)  చిత్రం రూపొందింది. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్ (C. Aswani Dutt)  ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లు(గ్రాస్) ను కలెక్ట్ చేసి.. ఈ ఏడాది ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ‘కల్కి..’ కచ్చితంగా ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇచ్చింది.

Nag Ashwin

ఇలాంటి స్క్రీన్ ప్లే తెలుగులోనే కాదు ఇండియన్ మూవీస్ లో కూడా ఇప్పటి వరకు చూడలేదు అనడంలో అతిశయోక్తి లేదు. పైగా కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న నాగ్ అశ్విన్.. ఇలాంటి పెద్ద సినిమాని.. హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దగలడు అని ఎవ్వరూ నమ్మలేదు. కేవలం హీరో ప్రభాస్ మాత్రమే నమ్మాడు. అతని నమ్మిన తర్వాతే మిగిలిన స్టార్స్ అంతా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు అనడంలో సందేహం లేదు.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘కల్కి 2898 ad ‘ టైటిల్ ను బట్టి.. ఇందులో ప్రభాస్ కల్కి అయ్యుంటాడు అని ముందుగా అందరూ అనుకున్నారు. కానీ ట్రైలర్ చూశాక.. ‘ప్రభాస్ కల్కి కాదు’ అని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. మరోపక్క అసలు ‘కల్కి..’ లో కల్కి పాత్రలో ఏ హీరో కనిపిస్తాడు? కల్కి పాత్ర యాస్కిన్(కమల్ హాసన్) (Kamal Haasan) ను ఎలా అంతమొందిస్తుంది? వంటి ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి.

అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ వెర్షన్ ప్రకారం.. ‘కల్కి..’ పాత్రలో ఏ హీరో కనిపించడు అని స్పష్టమవుతుంది. నిన్న సోషల్ మీడియాలో ముచ్చటించిన నాగ్ అశ్విన్.. ‘ ‘కల్కి..’ లో యాస్కిన్ ను అంతం చేయాల్సిన బాధ్యత భైరవ పాత్రకి ఉంది. తన స్నేహితుడు అశ్వద్ధామతో కలిసి యాస్కిన్ ను భైరవ అంతం చేయాలి’ అంటూ అతను క్లారిటీ ఇచ్చాడు. సో ‘కల్కి’ పుట్టుక అనేది ప్రపంచం అంతం కాకుండా ఆపడానికి అయ్యుండొచ్చు.

దర్శకుడు బి.గోపాల్ తో బాలయ్య సినిమా.. జరిగే పనేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.