March 26, 202505:15:42 AM

Naga Chaitanya, Sobhita Dhulipala: చైశోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

చైతన్య (Naga Chaitanya)  శోభిత (Sobhita Dhulipala) అకస్మాత్తుగా నిశ్చితార్థం జరుపుకొని అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. చైతన్య శోభిత జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చైతన్య శోభిత మధ్య దాదాపుగా ఆరు సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. చైతన్య 1986 సంవత్సరంలో జన్మించగా శోభిత 1992 సంవత్సరంలో జన్మించారు. శోభితకు సంబంధించిన కీలక విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శోభిత ధూళిపాళ తెలుగమ్మాయే కాగా గూఢచారి (Goodachari)  , మేజర్ (Major)  సినిమాలతో ఆమె మంచి పేరును సొంతం చేసుకున్నారు.

Naga Chaitanya, Sobhita Dhulipala

పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan: I) లో సైతం శోభిత కీలక పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. శోభిత తెనాలిలో పుట్టి వైజాగ్ లో పెరిగారు. శోభిత తల్లి శాంతారావ్ టీచర్ కాగా తండ్రి వేణుగోపాల్ రామ్ మర్చంట్ నేవీలో పని చేశారు. శోభిత ధూళిపాళ 2013 మిస్ ఇండియా రన్నరప్ కావడం గమనార్హం. ఒకవైపు సినిమాలలో కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో శోభిత నటించారు. గూఢచారి సినిమా తనకు ఎంతో స్పెషల్ అని శోభిత పేర్కొన్నారు.

హాలీవుడ్ సినిమాలలో సైతం శోభిత ముద్ర వేశారు. శోభితకు భక్తి ఎక్కువ కాగా టైమ్ దొరికితే ఆలయాలను సందర్శించడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిరోజూ సూర్యాష్టకం చదువుతానని శోభిత ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. శోభిత శాకాహారి కాగా ఎవరిపై ఆధారపడకుండా ఇంటి పనులు చేసుకోవడం ఆమెకు ఇష్టమని తెలుస్తోంది. బాల్యం నుంచి ఆమె భరతనాట్యం, గిటార్ నేర్చుకున్నారట.

నవలలు, హ్యారిపోటర్ బుక్స్ చదవడం అంటే ఎంతో ఇష్టమని శోభిత చెబుతున్నారు. చైతన్య శోభిత జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. చైతన్య శోభిత భవిష్యత్తులో కలిసి నటిస్తారేమో చూడాల్సి ఉంది. చైతన్య ప్రస్తుతం తండేల్ (Thandel) సినిమాలో నటిస్తుండటం గమనార్హం. చైతన్య రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది.

శోభిత ధూళిపాళ్ల బ్యాక్ గ్రౌండ్ గురించి ఈ విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.