March 23, 202508:25:17 AM

Naveen Polishetty: నవీన్‌ పొలిశెట్టి వచ్చాడు.. నవ్వులు తెచ్చాడు.. త్వరలో అంటూ..

నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ఎక్కడ, ఏమైంది, ఎప్పుడొస్తాడు.. అనే మాటలు నుండి ‘నవీన్‌ త్వరగా కోలుకోవాలి’ అనే ఆశించే వరకు వచ్చేసింది పరిస్థితి. దానికి కారణం ఆయన మీద అభిమానం, లేటుగా ఇచ్చినా క్లియర్‌గా ఆయనిచ్చిన సమాచారం. ‘మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’  (Miss Shetty Mr Polishetty)  తర్వాత విదేశాలకు వెళ్లిన నవీన్‌కు యాక్సిడెంట్‌ అయిన విషయం తెలిసిందే. పరిశ్రమలో, అభిమానుల్లో కొంతమందికి మాత్రమే ఈ విషయం తెలుసు. ‘నవీన్‌ ఎక్కడ?’ ప్రశ్న వైరల్‌ కావడంతో ఆయనే స్పందించాడు.

Naveen Polishetty

రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాల పాలైన నవీన్‌.. ఇప్పుడిప్పుడు తిరిగి కోలుకుంటున్నాడు. రెండు వరుస హెల్త్‌ అప్‌డేట్లు ఇచ్చిన తర్వాత.. ఇప్పుడు ఏకంగా ప్రేక్షకుల ముందుకే వచ్చేశాడు. ఆహాలో ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ కార్యక్రమానికి నవీన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. తనదైన శైలిలో పంచ్‌లతో అలరించిన నవీన్‌.. ఓ పాట కూడా పాడి సందడి చేశాడు. అలాగే తన హెల్త్‌ అప్‌డేట్‌ కూడా ఇచ్చాడు.

గత ఆరు నెలలు చాలా కష్టంగా గడిచాయి, ఎన్నో సవాళ్లు విసిరాయి అని చెప్పాడు నవీన్‌. ఒకానొక సమయంలో నా చేతి గాయం తగ్గుతుందో లేదో అనే ఆందోళన కూడా కలిగింది అని నవీన్‌ పొలిశెట్టి తెలిపాడు. అయితే ఆ కష్ట సమయంలో తనకు ఓదార్పునిచ్చింది సంగీతమే అని చెప్పాడు. అందుకే మ్యూజిషియన్లకు ఈ సందర్భంగా థ్యాంక్స్‌ చెబుతున్నా అని అన్నాడు నవీన్‌. పూర్తిగా కోలుకున్న వెంటనే సినిమాలు చేస్తా అని కూడా చెప్పాడు.

యాక్సిడెంట్‌ గురించి ఇటీవల చెప్పిన నవీన్‌.. ఆ తర్వాత ‘సింగిల్‌ హ్యాండ్‌’ అనే కాన్సెప్ట్‌తో ఓ వీడియో రిలీజ్‌ చేసి నవ్వించారు. రెండు చేతులు అవసరమయ్యే పనులను వీడియోలో చూపిస్తూ.. ఒక చేయి మాత్రమే తాను వినియోగించే పరిస్థితి ఉందని సెటైరికల్‌ మాట్లాడుతూ రూపొందించిన ఆ వీడియో ఫన్నీగా ఉంది. తన జీవన పోరాటంలో వినోదం అందించిన తోడ్పాటును తెలిపేలా ఆ వీడియోను రూపొందించారు.

వెండితెరపై భారీ తుపానుకు సిద్ధంగా ఉండండి.. తమన్‌ పోస్టు వైరల్‌

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.