March 26, 202509:26:10 AM

Priya Bhavani Shankar: నా వల్లే ఇండియన్2 ఫ్లాప్ అంటున్నారు.. ప్రియా భవాని కామెంట్స్ వైరల్!

ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో విడుదలై ఆ అంచనాలను ఆస్సలు అందుకోని సినిమాగా ఇండియన్2 సినిమా నిలిచింది. ఇండియన్2 (Bharateeyudu 2)  సినిమా శంకర్ (Shankar)  కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. ఈ సినిమాలో నటించిన ప్రియా భవాని శంకర్  (Priya Bhavani Shankar) ఇండియన్2 రిజల్ట్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నా కెరీర్ లో నేను సంతకం చేసిన భారీ బడ్జెట్ మూవీ ఇండియన్2 అని ఆమె అన్నారు.

Priya Bhavani Shankar

ఇండియన్2 సినిమా ఒప్పుకున్న వెంటనే నాకు ఎన్నో ఛాన్స్ లు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాలు చేస్తే మాత్రమే హీరోయిన్ గా భావిస్తున్నారని ప్రియా భవాని శంకర్ వెల్లడించారు. సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే తెలిస్తే ఎవరైనా సరే సినిమాలు ఎందుకు చేస్తారని ఆమె తెలిపారు. సినిమాలోని టెక్నీషియన్ దగ్గరినుంచి ప్రతి ఒక్కరూ సినిమా హిట్ అవ్వాలనే కష్టపడతారని ప్రియా భవాని శంకర్ పేర్కొన్నారు.

అందరూ ఇష్టంగా కష్టపడి వర్క్ చేసిన సమయంలో అది వర్కౌట్ కాకపోతే చాలా బాధేస్తుందని ప్రియా భవాని శంకర్ చెప్పుకొచ్చారు. ఇండియన్2 మూవీ హిట్ అవ్వదని తెలిసినా ఆ సినిమాను నేను వదులుకోలేకపోయేదానినని ఆమె తెలిపారు. ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ ఇండియన్2 ఫ్లాప్ కు తానే కారణమని కామెంట్స్ చేస్తే బాధేస్తోందని అన్నారు. సినిమా ఫ్లాప్ కావడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయని ప్రియా భవాని శంకర్ పేర్కొన్నారు.

కమల్ (Kamal Haasan) శంకర్ కాంబో సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు వద్దని అనుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. జనాలు నన్ను మాటలతో వేధిస్తున్నారని ప్రియా భవాని శంకర్ వెల్లడించడం గమనార్హం. ప్రియా భవాని శంకర్ చేసిన కామెంట్లు నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

‘శ్రీమంతుడు’ కి 9 ఏళ్ళు.. టోటల్..గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.