March 21, 202502:56:05 AM

Ramajogayya Sastry About ఆనందం అప్పుడే అయిపోలేదయ్యా.. రామజోగయ్య శాస్త్రి కామెంట్స్ వైరల్!

దేవర (Devara) సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయనే సంగతి తెలిసిందే. ట్రైలర్ లో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారనే క్లారిటీ రావడంతో పాటు దేవర లుక్ లో తారక్ అదిరిపోయాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలోని అన్ని పాటలకు రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) లిరిక్ రైటర్ గా పని చేశారనే సంగతి తెలిసిందే. రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికగా దేవర మూవీపై అంచనాలు పెంచేలా తరచూ పోస్టులు పెడుతున్నారు.

Ramajogayya Sastry

దేవర ట్రైలర్ విడుదలైన తర్వాత రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) ట్విట్టర్ లో ఆనందం అప్పుడే అయిపోలేదయ్యా ఇప్పుడే మొదలైందంటూ కామెంట్ చేశారు. ఆయుధపూజ పాట వస్తే ఇంక పట్టలేం మిమ్మల్ని అంటూ చెప్పుకొచ్చారు. రామజోగయ్య శాస్త్రి  (Ramajogayya Sastry) చేసిన పోస్ట్ తో ఆయుధ పూజ సాంగ్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సాంగ్ రిలీజ్ డేట్ గురించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

దేవర ట్రైలర్ కు అనిరుధ్  (Anirudh Ravichander) బీజీఎం విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుండగా సినిమాలో బీజీఎం ఎలా ఉంటుందో చూడాలి. దేవర సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఒకింత ఎక్కువగానే ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ పార్ట్ షాకింగ్ ట్విస్ట్ తో ముగియనుందని సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగేలా దేవర మూవీ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Shocking Trolls on Devara Movie Graphic

సినిమాలో చివరి 40 నిమిషాలు అదిరిపోతుందని జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వెల్లడించారు. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది. దేవర సినిమాలో రెండో పాత్రకు సంబంధించి షాకింగ్ ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమాలో తారక్ యాక్టింగ్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మరో రెండు వారాల్లో తేలిపోనుంది.

కొరటాల శివను ఇంతలా టార్గెట్ చేయడం కరెక్టా.. సరికాదంటూ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.