March 23, 202507:43:47 AM

Yashmi Gowda: ‘బిగ్ బాస్ 8’ : యష్మీ షాకింగ్ కామెంట్స్ వైరల్.!

‘బిగ్ బాస్ 8’…లోకి మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది యష్మీ గౌడ (Yashmi Gowda)  . కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగు సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు హౌస్ లో ఆమె గేమ్ ఆడే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో యష్మీ గురించి ఆమె టీం గట్టిగానే ప్రమోషన్ చేస్తూ వస్తోంది. గతంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు వంటి వాటిని వైరల్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె మొన్నామధ్య చెప్పిన తన బ్రేకప్ స్టోరీ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.

Yashmi Gowda

యష్మీ ప్రేమ కహానీ.. ఒక ఆమె వల్ల ముగిసిందట. యష్మీగౌడ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు బ్రేకప్ అయ్యింది. నేను ప్రేమించిన అబ్బాయి వాళ్ల అమ్మకు నేను సినీ పరిశ్రమలో ఉండటం ఇష్టం లేదు. తను నాకు ఈ విషయం చెప్పాడు. ‘మా అమ్మకు నువ్వు ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదు. మనం ‘ఎవరి దారి..వాళ్ళు చూసుకోవడం మంచిది’ అన్నాడు. అందుకు నేను పెద్దగా ఆలోచించకుండా సరే అన్నాను.

కొన్నాళ్ళు బాధగా అనిపించింది. తర్వాత ఆ బాధ నుండి బయటపడ్డాను. షూటింగ్స్ లో బిజీ అవ్వడం జరిగింది. ఏడాది ప్రేమలో ఉన్నప్పుడు అతను నన్ను అవాయిడ్ చేయడం బాధ అనిపించింది. ‘ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? అన్నప్పుడు నాకు ఈ విషయం(వాళ్ళ అమ్మ) చెప్పుకొచ్చాడు. నేనేమీ ప్రేమించమని ఒత్తిడి చేయలేదు.? అందుకే సరే అని మూవ్ ఆన్ అయిపోయాను” అంటూ చెప్పుకొచ్చింది. అయితే తాను ప్రేమించిన అబ్బాయి పేరు కానీ, ఆమె తల్లి ఎవరు అనే విషయాన్ని మాత్రం యష్మీ బయట పెట్టలేదు.

 

View this post on Instagram

 

A post shared by SumanTV (@sumantv_official)

బాలయ్య నటించిన ఆ బ్లాక్ బస్టర్ వెనుక ఇంత కథ ఉందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.