March 18, 202502:38:59 PM

Game Changer: థమన్ ట్వీట్ తో టెన్షన్ లో చరణ్ ఫ్యాన్స్.. ఇలా చేయడం రైటేనా?

ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాలలో గేమ్ ఛేంజర్  (Game changer)  ఒకటి కాగా డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ విషయంలో మెగా అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. థమన్ ట్వీట్ తో చరణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. గేమ్ ఛేంజర్ టీజర్ ను ఉద్దేశిస్తూ థమన్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. థమన్ (S.S.Thaman)  తన ట్వీట్ లో దసరాకు టీజర్ రాలేదని నిరాశపడొద్దని పేర్కొన్నారు.

Game Changer

గేమ్ ఛేంజర్ టీమ్ నిరంతరం ఆ పనుల్లోనే ఉందని థమన్ చెప్పుకొచ్చారు. గేమ్ ఛేంజర్ సీజీ, విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, బ్యాగ్రౌండ్, ఎడిటింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని ఆయన కామెంట్లు చేశారు. ప్రతి నెలా గేమ్ ఛేంజర్ కు సంబంధించి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేలా అన్ని పాటలకు లిరికల్ వర్క్స్ పూర్తి చేశామని థమన్ వెల్లడించారు.

ఈ నెల అక్టోబర్ 30వ తేదీన గేమ్ ఛేంజర్ నుంచి మరో సాంగ్ రిలీజవుతుందని డిసెంబర్ నెల 20వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన అన్నారు. గేమ్ ఛేంజర్ నుంచి రిలీజవుతున్న మూడో పాట మెలోడీ సాంగ్ అని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీ 300 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీజర్ ను కూడా సరైన సమయానికి రిలీజ్ చేయకపోతే సినిమాపై అంచనాలు ఎలా పెరుగుతాయంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా 2024 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

మెగాస్టార్ చిరంజీవి అక్కడ ఏకంగా ఆరు ఎకరాలు కొన్నారా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.