March 15, 202509:47:59 AM

Martin Twitter Review: ‘మార్టిన్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ షార్జా హీరోగా ‘పొగరు’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దానికి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత అతను కొంత గ్యాప్ తీసుకుని ‘మార్టిన్’ (Martin) అనే పాన్ ఇండియా సినిమా చేశాడు. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌’, ‘ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్’ సంస్థలపై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Martin Twitter Review

ఇది కంప్లీట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ మూవీ అని టీజర్, ట్రైలర్స్ తో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 11న అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ డీల్స్, టెర్రరిజం బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఇండియా నుండి పాకిస్తాన్ కి వెళ్లిన హీరో..

చిన్న తప్పు చేసి అక్కడి క్రూరమైన జనాలకి, టెర్రరిస్ట్..లకు దొరికిపోతాడు. ఆ తర్వాత అతను ఎలా తప్పించుకున్నాడు అనేది మెయిన్ పాయింట్ గా తెలుస్తుంది ‘మార్టిన్’ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు విపరీతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉంటాయట. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ‘మార్టిన్’ నచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సొంతమైన అరుదైన ఘనత ఇదే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.