
సినీ పరిశ్రమని వరుస విషాదాలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. నిత్యం ఎవరొక సెలబ్రిటీ కన్నుమూశారు అనే వార్తలు వింటూనే ఉన్నాం. కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తుంటే, ఇంకొంతమంది వయోభారంతో, అలాగే యాక్సిడెంట్ల పాలై కొంతమంది, సూసైడ్ చేసుకుని కొంతమంది.. ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Mankombu Gopalakrishnan
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ (Mankombu Gopalakrishnan) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన నిన్న అంటే మార్చి 17న కన్నుమూసినట్టు తెలుస్తుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మంకొంబు గోపాలకృష్ణన్ మరణించినట్టు స్పష్టమవుతుంది. దీంతో మళయాల సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నట్టు అయ్యింది. మన టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli) కూడా మంకొంబు గోపాలకృష్ణన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
‘ప్రముఖ మలయాళ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ మరణవార్త నేను జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా బాధగా అనిపిస్తుంది. ‘ఈగ’ (Eega) ‘బాహుబలి’ (Baahubali) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి సినిమాల మలయాళ వెర్షన్లకి ఆయనతో కలిసి పనిచేశాను. అది ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. నేనెప్పుడూ ఆయనకు కృతజ్ఞుడనై ఉంటాను. ఓం శాంతి’ అంటూ రాజమౌళి తన సోషల్ మీడియాలో ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ఇక మంకొంబు గోపాలకృష్ణన్ గారు 200 కి పైగా సినిమాల్లో 700 వరకు పాటలు రాశారు. అలాగే డైలాగ్ రైటర్ గా కూడా ఈయన చాలా పాపులర్.